arrangements made in temples for mukkoti ekadasi వైకుంఠ ఏకాదశి ముస్తాబైన వైష్ణవాలయాలు..

Arrangements made in temples for mukkoti ekadasi

balaji temples, venkateshwara swamy temples, telugu states, telangana, andhra pradesh, vaikunta ekadasi, mukkoti ekadasi, vaishnav temples, vaikunta dwadasi, tirumala tirupati devasthanam, badradri ramalayam, devotees

On the ocassion of vaikunta ekadasi temples in both telugu states made arrangments by temple commitees, mainly in vaishnov temples.

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన వైష్ణవాలయాలు..

Posted: 12/28/2017 03:41 PM IST
Arrangements made in temples for mukkoti ekadasi

వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారి దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు ఇదివరకే తండోపతండాలుగా పుణ్యక్షేత్రాలకు చేరకున్నారు. క్యూలైన్లలో బారుతు తీరుతున్నారు. మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ఏకాధశి గడియల్లో శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనంతో దర్శించుకోవడం శుభప్రదమని భావిస్తున్న భక్తులు.. వేలాది సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

దీంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక గోవిందమాల వేసుకున్న భక్తులు కూడా కాలిబాట గుండా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఏకాదశి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సామాన్య భక్తులు, ప్రముఖులకు వేర్వేరుగా బస, దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు.

సర్వదర్శనం మినహా ఐదు రోజుల పాటు దివ్యదర్శనం సహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కనుమ రహదారులను 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు. ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ఉదయం 5 గంటలకు వీఐపీ దర్శనాలను అనుమతించిన అనంతరం  7.30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది. రెండు రోజులు పాటు 40 గంటలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని అలయాలు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. మరీ ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసే అలయాలల్లో ప్రత్యేక అధ్యాత్మిక శోభను సంతరించుకునేలా ఆలయ కమిటీలు ఏర్పాట్లను చేశాయి. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నారు. రాత్రి ఒంటి గంట నుంచి ఆలయాలకు భక్తుల తాకిడి పెరుగనున్న నేపథ్యంలో పోలీసులు కూడా గస్తీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కాగా, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు భద్రాది రామయ్య ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకులకు కూడా వైకుంఠ ద్వాదశి రోజున ముగియనున్నాయి. దీంతో ఇక్కడ కూడా భక్తుల తాకిడి అధికంగానే వుంది. దశమి రోజునే వచ్చి పుణ్యక్షేత్రాలకు చేరుకునే భక్తులకు కూడా అలయ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పాటు ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహణకు సిద్దమయ్యారు. బాపట్లలోని క్షీర భావన్నారాయణ ఆలయం, తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అలయం, అనంతగరి పద్మనాభస్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం సహా అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులు తరలివెళ్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh