MonoRail to Hitec City మోనో రైలు నిర్మాణంపై సర్కార్ దృష్టి

Telangana government mulls monorail in hyderabad s it corridor

monorail in hyderabad, monorail in cyberabad, monorail in gachibowli, monorail to shilparamam, monorail to hitec city, k.chandrashekar rao, monorail, hyderabad, hitec city, mmts, hyderabad metro, telangana government

The government has also proposed to extend the Metro Rail from Shilparamam up to Raidurg in the near future."The state government is contemplating a Monorail project for the IT corridor.

మోనో రైలు నిర్మాణంపై సర్కార్ దృష్టి

Posted: 12/28/2017 02:30 PM IST
Telangana government mulls monorail in hyderabad s it corridor

రోజురోజుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో జనసాంధ్రత అధికమవుతుంది. దీంతో తమ కార్యాలయాలకు, వ్యాపారాలకు, ఇతర అవసరాలపై వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో రద్దీ ఎక్కువై వాహనదారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజారావాణా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో వుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంఎంటీఎస్ రైళ్లు అత్యంత చౌకగా ప్రజలకు రవాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఇక తాజాగా మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక మరో ఏడాదిలోగా ఈ మెట్రో రైళ్లు నగరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ.. మొత్తంగా మూడు కారిడార్లలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే రెండో దశ మెట్రో నిర్మాణాలను చేపడతామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అటు సైబరాబాద్ నుంచి ఇటు మియాపూర్ అటు గచ్చిబౌలి ప్రాంతాలను కలిపడంపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాదీలకు వాహన కష్టాలను తీర్చేందుకుగాను.. మరో ప్రజారవాణా రంగాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ యోచిస్తుంది. అదే మోనో రైలు. ఈ రైలు మార్గాన్ని నిర్మాణం మెట్రోతో పోల్చితే చౌకగా సాగిపోతుందని.. పరిశీలించిన ప్రభుత్వం.. తొలి దశలో మియాపూర్, శిల్పారామం, గచ్చిబౌలి మీదుగా 15 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టాలని భావిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)ని సలహా సంస్థగా నియమించింది.

కేవలం పిల్లర్ నిర్మాణాలతో పూర్తైయే ఈ రైలుకు పట్టాలు (ట్రాక్స్) అవసరం కూడా లేకుండానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. పిల్లర్ల పైన రైలు ప్రయాణిస్తుంది. దీంతో ఇతర రైళ్లలా కాకుండా దీనిని తక్కువ విస్తీర్ణంలో నిర్మించడానికి వీలవుతుంది. హైదరాబాదు వంటి రద్దీ బాగా వుండే నగరాలకు ఇవి చాలా అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించిన ఈ రైలుకు భాగ్యనగర వాసుల నుంచి కూడా అదరణ లభిస్తుందని నమ్మకంగా వున్న సర్కార్ ఈ మేరకు నిర్మాణ సాధ్యసాధ్యాలపై పరిశీలిస్తుంది. దీంతో పాటు ట్రాఫిక్ సమస్య నివారణకు కూడా ప్రభుత్వం మోనో రైలుపై దృష్టి సారించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : monorail  hyderabad  hitec city  mmts  hyderabad metro  telangana government  

Other Articles