Liquor prices hiked by 10 per cent in Telangana తెలంగాణ సర్కార్ న్యూఇయర్ షాక్..!

Year end shocker telangana government hikes liquor prices

Liquor prices hiked, Liquor prices hiked by 10 per cent, Liquor prices hiked in Telangana, Liquor prices hiked by 10 per cent in Telangana, liquor bottle, indian made foreign liquor (imfl), liquor, ready-to-drink (rtd), telangana state beverages corporation limited, telangana today, vat, wine, news, hyderabad, hyderabad news, telangana, telangana news

In a shocker to guzzlers and more particularly those planning for new year revelry, State government on Tuesday night hiked the prices of all types of liquor, except beer with immediate effect.

తెలంగాణ సర్కార్ న్యూఇయర్ షాక్..!

Posted: 12/27/2017 10:03 AM IST
Year end shocker telangana government hikes liquor prices

నూతన సంవత్సర అగమనోత్సవ వేడుకలకు సిద్దమవుతున్న యువతకు.. అందులోనూ మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భాగ్యనగరాన్ని రాజధానిగా చేసుకుని ఏలుతున్న తెలంగాణలో ఎలాంటి నిధులకు కొరత లేదని చెప్పిన ప్రభుత్వం.. ప్రతీ ఏడాది వేసవికి ముందు బీరు ధరలను, ఇక దసరా సమయంలో మద్యం ధరలనే పెంచే ప్రభుత్వం ఈ సారి తన పంథాను మార్చి ఏకంగా కొత్త సంవత్సర అగమనానికి ముందే ఈ మేరకు చర్యలు తీసుకుని మధ్యం ప్రియుల జేబులు కొల్లగొట్టేందుకు సిద్దమైంది.

మధ్యం ధరలను అమాంతం 5 నుంచి 12 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 12ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా మద్యం ధరలను పెంచుతూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలను కనిష్ఠంగా 5 శాతం నుంచి గరిష్ఠంగా 12 శాతం వరకూ పెంచుతూ… పెరిగిన ధరల్లో పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది. ఇక ధరలు అధికంగా పెరిగిన మద్యాన్ని పరిశీలిస్తే.. ఎక్కువ మంది తాగే సాధారణ మద్యానికే రెక్కలు అధికంగా వచ్చాయి.

కార్టన్ ధర రూ. 700 లోపు ఉన్న చౌక బ్రాండ్లపై 12 శాతం, ఆపై రూ. 1000 వరకూ కార్టన్ ధర ఉండే బ్రాండ్లపై 10 శాతం, ఆపై ధర ఉన్న బ్రాండ్లకు 5 శాతం చొప్పున ధర పెరుగుతుందని పేర్కొంది. అయితే పెరిగిన ధరలు లగ్జరీ బ్రాండ్లపై కాకుండా ఎక్కువమంది తాగే బ్రాండ్లపై ప్రభావాన్ని చూపుతోంది. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక మద్యం ధరల సవరణపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకే నిర్ణయాలు తీసుకున్నామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

180 ఎంఎల్ క్వార్టర్ బాటిల్ ధరలు(అంచనా):

రాయల్‌ స్టాగ్‌ ధర రూ. 150 నుంచి రూ. 165
రాయల్‌ చాలెంజ్‌ ధర రూ. 210 నుంచి రూ. 225
బ్లెండర్స్‌ ప్రైడ్‌ ధర రూ. 240 నుంచి రూ. 260
సిగ్నేచర్‌ ధర రూ. 250 నుంచి రూ. 275
100 పైపర్స్‌ ధర రూ. 410 నుంచి రూ. 480కి పెరగనున్నాయి
రాయల్‌ గేమ్‌ ధర రూ. 65 నుంచి రూ. 70
ఓల్డ్‌ టవెరన్‌ ధర రూ. 80 నుంచి రూ. 90
ఆఫీసర్స్‌ చాయిస్‌ ధర రూ. 90 నుంచి రూ. 100
ఏసీ ప్రీమియం, ఎంసీ విస్కీ, ఎంసీ బ్రాందీ, ఐబీ విస్కీ వంటి బ్రాండ్లు ధర రూ. 110 నుంచి రూ. 120.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Liquor  Telangana  indian made foreign liquor  kcr  excise department  

Other Articles