Terror Strikes Feared Ahead of New Year హైఅలర్ట్: న్యూ ఇయర్ వేడుకలపై ఉగ్రవాదుల గురి

Airports on high alert over possible terror attack ahead of new year

airports, Bureau of Civil Aviation Security, new year, Pakistan, terror attacks, high alert, new year celebrations, new year eve

The Bureau of Civil Aviation Security (BCAS) has sent an alert to all the airports and airlines in India over a possible terror attack ahead of the new year celebrations all around the world.

హైఅలర్ట్: న్యూ ఇయర్ వేడుకలపై ఉగ్రవాదుల గురి

Posted: 12/26/2017 11:07 AM IST
Airports on high alert over possible terror attack ahead of new year

అంబరాన్ని తాకే నూతన సంవత్సర ఆగమ వేడుకలలో అత్యంత అప్రమత్తత అవసరమని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొత్త సంవత్సరాన్ని సంతోషంగా అహ్వానించే యువతీ యువకులు టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అస్కారం ఉందంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదేశాలను జారీ చేసింది. కొత్త సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పథక రచన చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అన్ని రాష్ట్రాల పోలీస్ డీజీపీలకు సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. న్యూఇయర్ రోజున వేడుకలు నిర్వహించి.. జనసామర్థ్యం అధికంగా వున్న ప్రదేశాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేయనున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే ప్రైవేటు సంస్థలకు కూడా ఇప్పటికే పలు భద్రతా చర్యలను పాటించాలని అదేశాలను జారీ చేసినట్లు సమాచారం. దీంతో కొత్త సంవత్సరాన్ని అహ్వానించే ప్రజలకు కూడా పోలీసులు అంక్షలు విధించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్భంధీగా భద్రతా ఏర్పాట్లను చేయనున్నారు.

ఇక ఇదే క్రమంలో బ్యూరో అప్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కూడా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు నూతన సంవత్సర వేళ అప్రమత్తంగా వుండాలని అదేశాలను జారీ చేసింది. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో, ముఖ్యంగా టెర్మినల్ బిల్డింగ్ లోపల అప్రమత్తంగా ఉండాలని, లోపలికి ప్రవేశించే వారిపై ఓ కన్ను వేయాలని బీసీఏఎస్ సూచించింది. కారు పార్కింగ్ ప్రదేశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, కారు బాంబులతో దాడికి దిగే అవకాశం ఉండడంతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పేర్కొంది. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles