Janasena Demands justice to Dalit Woman ఆ ఘటనలు పునరావృతమైతే ప్రమాదం: పవన్ కల్యాన్

Pawan kalyan demands ap govt explanation on dalit woman stripped

janasena, pawan kalyan, Dalit woman assaulted, Dalit woman stripped, land dispute, sensitive issue, chunduru, karamchedu, TDP workers, Land Grab, Visakhapatnam, Andhra Pradesh news, india news, social news, latest news

janasena pawan kalyan demands justice and honour of Dalit woman to be restored, who was stripped and assaulted in Pendurthi of Visakhapatnam, by upper caste political leaders of ruling party in public.

దళిత మహిళ పరాభవ ఘటన కలిచివేసింది: పవన్ కల్యాన్

Posted: 12/23/2017 10:53 AM IST
Pawan kalyan demands ap govt explanation on dalit woman stripped

ఎవరు తప్పు చేసినా తాను తప్పక ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత, సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పెందుర్తిలో ఓ దళిత మహిళను అందరూ చూస్తుండగా చీరను చింపి అవమానించిన ఘటనపై ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణ కోరుతున్నారని.. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ దారుణానికి టీడీపీ నేతలే ఒడిగట్టారని రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. సున్నితమైన అంశం కాబట్టి తాను రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిగణలోకి తీసుకుని వివరణ కోరుతున్నానని అన్నారు.

స్వాతంత్ర భారతవనిలో మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో ఇంకా ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడుతన్న అగ్రవర్ణ అహంకార జాడ్యం విడాలని సూచించారు. ఈ ఘటన గురించి విన్న తర్వాత తాను చాలా డిస్టర్బ్ అయ్యానని తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నేరస్తులపై పోలీసులు, ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దీనివల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయని అన్నారు. కారంచేడు, చుండూరు ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం కూడా వుందని చెప్పారు. అలాంటి ఘటనలు రాష్ట్రంలోని శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చివేస్తాయని అన్నారు.

శాంతిసామరస్యం కాపాడాలనే..: పవన్ కల్యాన్

చాలా సున్నితమైన ఇలాంటి అంశాలపై స్పందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని... లేకపోతే సామరస్యం దెబ్బతింటుందని పవన్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పరిస్థితులు దిగజారుతాయని అన్నారు. రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతను రేకెత్తించిందో ఆలోచించుకోవాలని... అధికారులు మౌనాన్ని వీడాలని సూచించారు. ఈ విషయంలోకి తాను బాధితుల మద్దతు ప్రకటించిన ఘటనాస్థలానికి వెళ్లి సభను ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర అధికారులు అలోచించాలని అన్నారు.

నిందుతులపై చర్యలు తీసుకోవాలి: జనసేన డిమాండ్

పోలీసు, జిల్లా పాలనాధికారులపై విపరీతమైన ఒత్తిడి నెలకొంటుందనే తాను ఇలాంటి పనులు చేయడం లేదని, అందుచేత అధికారులు వెంటనే స్పందించి.. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత మహిళ గౌరవాన్ని కాపాడాలని, నిందితులపై చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా కొందరు చేసే పనులకు కులం రంగు పులుముతున్నారని... ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.

ఈ ఘటనపై వెంటనే చర్య తీసుకోవాలని... నిస్సహాయ మహిళకు అండగా నిలబడాలని విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నానని ఆయన అన్నారు. అభాగ్యురాలికి వెంటనే న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు ఏ ఒక్క వ్యక్తి కాని, ఏ ఒక్క వర్గం కానీ భంగం కలిగిస్తే... అలాంటివారిని అధికారులు క్షమించరాదని అన్నారు. ఒకవేళ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తే... చట్టాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తాసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. సెన్సేషన్ కోసం మీడియా పాకులాడరాదని... బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles