wife murders husband with help of lover మరో స్వాతి.. ప్రియుడి పార్టీకి భర్తతో వెళ్లి..

Another swathi case in cuddapah wife murders husband with help of lover

swathi, sudhakar reddy, aruna, cudappah, kadapa, pullampeta, shiva, sai subash, love affair, nagar kurnool, kurnool, venkateshwarmma, supari, manohar, rajesh, maddaiah, sudhakar reddy, telanagana, andhra pradesh, telugu states, kurnool police, crime

Evenafter nagarkurnool swathi and venkateshwaramma cases, another similar inicdent comes into light as wife forcefully takes husband to lovers party to a loney place where her lover murders him.

కడప జిల్లాలో మరో స్వాతి.. ప్రియుడి పార్టీకి భర్తతో వెళ్లి..

Posted: 12/23/2017 11:48 AM IST
Another swathi case in cuddapah wife murders husband with help of lover

నాగర్‌ కర్నూల్‌ లో భర్తను హతమార్చి అతని స్థానంలోకి ప్రియుడ్ని తీసుకువచ్చేంకు సినిమా కథను తలపించేవిధంగా క్రైంస్టోరి రచించిన స్వాతి ఉదంతంపై పోలీసులు విచారణ సాగిస్తున్న క్రమంలోనే కర్నూలు జిల్లాలో వెంకటేశ్వరమ్మ తన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని భర్తను హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులను దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులకు కడపలో మరో ఘటనతో షాక్ అయ్యారు.

ఈ ఘటనలో కూడా ఓ భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. తన ప్రియుడు ఇచ్చే పార్టీకి తన భర్తకు కూడా బలవంతంగా తీసుకెళ్లి దారుణనానికి పాల్పడిందీ భార్య. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. హతుడు కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి తమ కొడుకు అచూకీ తెలియడం లేదంటూ పోలీసులను అశ్రయించడంతో అసలు వివరాలు ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివసించే శివ, అరుణ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వివాహానికి ముందే సాయి సుభాష్ అనే వ్యక్తితో అరుణకు ప్రేమ వ్యవహారం ఉంది. అయితే పెళ్లైన తరువాత కూడా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించడంతో.. దానిని అపాలని  పలుమార్లు శివ వారించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు అరుణ ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది.

సాయి సుభాష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ పేరుతో భార్యభర్తలిద్దరిని తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి విచక్షణా రహితంగా శివను కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పుల్లంపేట మండలం అన్నసముద్రం అటవీప్రాంతంలో పడేశారు. శివ కనిపించకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణ, సాయిసుభాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swathi  sudhakar reddy  aruna  cudappah  kadapa  pullampeta  shiva  sai subash  love affair  crime  

Other Articles