టాలీవుడ్ లో పైరసీ కలకలం రేగింది. కొత్త సినిమాలు విడుదల కాకముందే పైరసీ అయ్యాయంటూ ఓ ప్రముఖ మీడియాలో వార్తలు రావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే నాని నటించిన ఎంసీఏ, పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి చిత్రాలు లీక్ కాకుండా చూడాలంటూ నిర్మాతలు పోలీసులకు విజ్నప్తి చేసినట్లు మాత్రమే తెలిసింది. ఆయా చిత్ర నిర్మాతలు దిల్ రాజు, రాధాకృష్ణలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ చిత్రాన్ని పైరసీ నుంచి కాపాడుతామంటూ చిత్ర ఫైనాన్షియర్ కృష్ణయ్యకు ముగ్గురు వ్యక్తులు తెలిపారు. అందుకుగానూ పెద్ద మొత్తం ముట్టజెప్పాలని వారు కోరారు. దీంతో కృష్ణయ్య పోలీసులను ఆశ్రయించగా.. వారు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. 2012 నుంచి వీరు ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఆ రెండు చిత్రాల నిర్మాతలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.
ఇక నిర్మాత దిల్ రాజు ఫిర్యాదు చేశాక మీడియాతో మాట్లాడారు. పైరసీ అంటే దొంగతనాన్ని ఎంకరేజ్ చేయటం లాంటిదిేనని.. దయచేసి చూడొద్దంటూ విజ్నప్తి చేశారు. తొలుత ఆయా చిత్రలు పైరసీ అయ్యాయంటూ వార్తలు రావటంతో ఒక్కసారిగా కలకలం రేగగా.. తర్వాత అసలు విషయం తెలియటంతో టాలీవుడ్ ఊపిరిపీల్చుకుంది.
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more