NBW issued against tollywood producer టాలీవుడ్ నిర్మాతపై నాన్ బెయిలబుల్ వారెంట్

Court issues non bailable warrant against tollywood producer

ravindrareddy, producer, tollywood, financier, jaya janaki nayaka, andhra pradesh, politics, entertainment, latest news

East godavari prathipadu court issues a non bailable warrant against popular tollywood producer ravindrareddy in a cheque bounce case.

టాలీవుడ్ నిర్మాతపై నాన్ బెయిలబుల్ వారెంట్

Posted: 12/20/2017 05:09 PM IST
Court issues non bailable warrant against tollywood producer

సినీ రంగ ప్రముఖులపై ఈ మధ్య కేసులు నమోదు కావడం.. దీంతో న్యాయస్థానాలు వారిపై వారెట్లు జారీచేయడం.. సాధారణంగా మారిపోయింది. ఇలాంటి కేసుల్లో కొందరు వాటిని చివరి వరకు ఎదుర్కొంటుండగా, మరికొందరు మాత్రం వారెంట్లు జారీ అయిన తరువాత దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం కూడా తెలిసిందే. ఇటీవలే నటి జీవితపై ఇలాంటి కేసు నమోదు కాగా, తాజాగా నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు మిర్యాల రవింద్రరెడ్డిపై చెక్ బౌన్స్ కేసు నమోదు కాగా, ఆయన న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఫైనాన్షియర్ కు రవీంద్రరెడ్డి ఇచ్చిన రూ.50 లక్షల చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో పలుమార్లు ఆయన చెక్ బౌన్స్ అంశాన్ని రవింద్రరెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. అయినా అయన పట్టించుకోకపోవడంతో ఏకంగా న్యాయస్థానాన్ని అశ్రయించాడు.

ఈ కేసుకు సంబంధించి రవీంద్రరెడ్డికి కోర్టు పలు సార్లు నోటీసులు పంపింది. అయితే, కోర్టు నోటీసులపై రవీంద్రరెడ్డి స్పందించకపోవడంతో ఇవాళ నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. కాగా రవీంద్ర రెడ్డి. గౌతం మీనన్‌ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో,  బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన జయ జానకి నాయక చిత్రాలను నిర్మించిన విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles