man born on February 30 as per his birth certificate ఈ యువకుడు అధికారికంగా పుట్టనే లేదు.. తెలుసా.?

How this ludhiana man was born on february 30 as per his birth certificate

birth certificate, Ludhiana news, Punjab news, Harpreet Singh, Thakarwal, Ludhiana civil surgeon office, Punjab government, viral news

Harpreet Singh of Thakarwal cannot celebrate his birthday ever if he goes by the birth certificate issued to him by the Ludhiana civil surgeon office which says he was born on February 30, 1995.

ఈ యువకుడు అధికారికంగా పుట్టనే లేదు.. తెలుసా.?

Posted: 12/19/2017 11:09 AM IST
How this ludhiana man was born on february 30 as per his birth certificate

క్యాలెండర్ లో అన్ని నెలలు 30వ తేదీని కలిగివుంటాయి. అయితే అన్ని నెలలతో ఒక నెల మాత్రం భిన్నం. అదే ఫిబ్రవరి మాసం. అ నెలలో 30 వ తేదీ వుండదు. నాలుగేళ్లకు ఓ పర్యాయం మాత్రమే 29వ తేదీ వస్తుంది. అందుకనే దానిని లీప్ ఇయర్ అని కూడా అంటారు. ఈ విషయం మూడో తరగతి విద్యార్థిని అడిగిన ఠక్కున చెప్పేస్తారు. అయితే ఉన్నత విద్యార్హతలు కలిగి, పోటీ పరీక్షలు రాసిన ప్రభుత్వ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. చదువుకుంలే ఉన్న మతిపోయిందన్న చందంగా వుంది పంజాబ్ హెల్త్ ఆఫీసర్లు పరిస్థితి.

ఎందుకంటే ఫిబ్రవరి 30కి ఆ రాష్ట్ర హెల్ అధికారులు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. ఎన్నడూ రానేరాని ఈ తేదిని ఓ కుర్రాడి పుట్టిన రోజుని అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాదు ఏకంగా ఈ మేరకు అధికారికంగా బెర్త్ సర్టిఫికేట్ కూడా జారీ చేశారంటే వారి మేధస్సుకు నమస్కరించక తప్పదు. అందరినీ విస్మయానికి గురిచేస్తున్న ఈ తేదీపై మరిన్ని వివరాలు… లూథియానాకు చెందిన హర్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 20, 1995లో పుట్టాడు. పంజాబ్ ఓపెన్ స్కూల్ లో పదోతరగతి పూర్తి చేసిన మనోడు … కెనడా వెళ్లేందుకు రెడీ అయ్యాడు.

అయితే పాస్ పోర్ట్ అధికారులు అతనికి అనుమతి నిరాకరిస్తున్నారు. కారణమేంట్రా అంటే పుట్టినరోజు తప్పుగా ఉండటమే. బర్త్ సర్టిఫికేట్ లో  ఫిబ్రవరి 30 అని రాశారు. అది గమనించకుండా సివిల్‌ సర్జన్‌, మరో ఇద్దరు ఉన్నతాధికారులు దానిపై సంతకం చేశారు. ఇక దాని సవరణ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాడు హర్‌ప్రీత్‌.  ఏడాది నుంచి ఎందరిని కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా.. ఎవరూ అతన్ని పట్టించుకోవటం లేదు. దీంతో మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్లబోసుకున్నాడు హర్‌ప్రీత్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles