Reliance Jio Triple Cashback offer Extended | రిలయన్స్ జియో.. ట్రిపుల్ క్యాష్ ఆఫర్.. మరో గుడ్ న్యూస్

Reliance jio triple cashback offer extended

Reliance Jio, Jio triple cashback Offer, Reliance Jio Offers, Jio New Plans, Jio Offers Extended

Reliance Jio triple cashback offer extended where consumers can get up to Rs. 2,599 on every recharge of Rs. 399 or above. The new deadline for the offer is December 25. The offer has seen an extension for another 10 days. Earlier, the company announced that the Triple cashback will end on December 15 though with the extension, the offer now ends on December 25.

జియో.. క్యాష్ బాక్... గుడ్ న్యూస్

Posted: 12/18/2017 06:31 PM IST
Reliance jio triple cashback offer extended

రిలయన్స్‌ జియో మరోసారి తన ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ గడువును పొడిగించింది. మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ.. కొత్త డెడ్‌లైన్‌గా డిసెంబర్‌ 25గా నిర్ణయించింది. అప్పటి వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అంతకుముందు ప్రకటించిన ఈ ఆఫర్‌ గడువు డిసెంబర్‌ 15తో ముగిసింది.

నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 25 మధ్యలో రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేయించుకునే కస్టమర్లకు రూ.2599 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. జియో ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద మైజియో, జియో.కామ్‌ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్‌ చేస్తోంది.

తర్వాత రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్‌లతో పాటు ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌, ట్రావెల్‌ కొనుగోళ్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో ఆఫర్‌ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల స్టేటస్‌ను తెలుసుకోవడం కోసం జియో సబ్‌స్క్రైబర్లు మై జియో యాప్‌లోని మై ఓచర్స్‌ సెక్షన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles