TDP MLC Rajendra Prasad fire on BJP MLC Somu Veerraju | 2019 అధికారం టీడీపీదే.. మరి కౌంటర్?

Tdp mlc rajendra prasad fire bjp mlc

Andhra Pradesh, 2019 Elections, BJP, MLC Somu Veerraju, MLC Rajendra Prasad, TDP MLC Rajendra Prasad, Gujarat Himahal Poll Results

BJP MLC Somu Veerraju Confident on 2019 Elections Victory. TDP MLC Rajendra Prasad Fire on Veerraju and Purandeswari.

2019 లో అధికారం... ఏపీలో బీజేపీ పగటి కలలు

Posted: 12/18/2017 05:56 PM IST
Tdp mlc rajendra prasad fire bjp mlc

తాజా గెలుపు కమలం పార్టీలో కొత్త షోష్ నింపుతోంది. ఈ క్రమంలో ఒక్కో నేతలు మీడియా ముందుకు వచ్చి తమ స్పందన తెలియజేస్తున్నారు. అయితే బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. 2019లో ఏపీలో అధికారాన్ని శాసించేది బీజేపీనే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.

దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా మండిపడారు. టీడీపీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సరికావని ఆయన అన్నారు. పగటి కలలు కనడం మానుకోవాలంటూ హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీర్రాజు కూడా చేసిన వ్యాఖ్యలను కలుపుకుని టీడీపీ కీలక సమావేశంలో చర్చిస్తామని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

టీ సర్కార్ పై ఆగ్రహం...

ప్రపంచ తెలుగు మహా సభలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును సభలకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్టీఆర్ ఫొటోను ఏర్పాటు చేయకపోవటంపై వస్తున్న విమర్శలను ఉద్దేశించి టీ సర్కార్ ఆ విషయంలో నిర్లక్ష్యం వహించటం బాధాకరమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  TDP  2019 Elections  బీజేపీ  టీడీపీ  2019 ఎన్నికలు  

Other Articles