Governor office denies occupied bathroom entry స్నానం చేస్తున్న మహిళను తొంగిచూడలేదు

Tn governor office denies he entered occupied bathroom in cuddalore

Tamil Nadu, TN Governor, Banwarilal, occupied bathroom, Cuddalore, Raj Bhavan, Kannabiran, Kancheepuram, Chengalpet, crime

Tamil Nadu Governor Banwarilal Purohit's office termed as "mischievous and scurrilous" media reports that he entered an occupied bathroom in Cuddalore district.

స్నానం చేస్తున్న మహిళను తొంగిచూడలేదు

Posted: 12/16/2017 11:16 AM IST
Tn governor office denies he entered occupied bathroom in cuddalore

తమిళనాడు గవర్నర్ గా నూతనంగా నియమితుడైన బన్వరీలాల్ పురోహిత్ కు బాధ్యతలు అందుకున్న సమయం కలసివచ్చినట్టు లేదు. ఆయన ఏం చేయబోయినా.. అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. ఇటీవలే ఓ మహిళ ఫిర్యాదు చేయడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఊహించన పరిణామంతో గవర్నర్‌కు షాక్‌కు గురయ్యారు. తాను స్నానం చేస్తుండగా గవర్నర్ చూశారని అమె ఏకంగా పోలీసులను అశ్రయించి పిర్యాదు చేసింది. ఇక తాజాగా తన కాన్వాయ్లోని ఓ వాహనం బైక్ ను ఢీ కొనడంతో ఇద్దరు మరణించాన్న వార్తకూడా సత్యదూరమని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశాల అనంతరం.. స్వచ్ భారత్ అభియాన పథకం కింద స్థానికంగా నిర్మించిన బాత్రూమ్ లను పరిశీలించారు. ఇందుకోసం వీధి వీధి తిరుగుతూ పలు ఇళ్లను సందర్శించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళుతూ.. పక్కనున్న బాత్రూంలోకి తొంగిచూశారు. లోపల ఓ మహిళ స్నానం చేస్తుండటంతో.. వెంటనే వెనక్కితిరిగారని దీంతో తన పరువుకు భంగం కలింగిందని అరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. గవర్నర్ పై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ అమె డిమాండ్ చేస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యింది.

గవర్నర్‌ చర్యను ప్రతిపక్ష డీఎంకే నిరసించింది. అయితే తాను బాత్ రూంలోకి తొంగిచూసి.. ఓ అడపడచు పరువుకు భంగం కలిగించానని వచ్చిన అరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని గవర్నర్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో వెలువరించింది. స్వచ్చా భారత్ అభియాన్ నిధులతో నిర్మించిన టాయ్ లెట్లను పరిశీలించేందుకు తాను వెళ్లిన మాట నిజమేనని.. అయితే ఎవరి బాత్ రూంలోకి గవర్నర్ తొంగి చూడలేదని రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి.

ఈ ఉదంతం ఇలా ఉండగానే గవర్నర్ మరో వివాదంలో కూడా ఆయనకు చుట్టుకుంది. గవర్నర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. భద్రతా సిబ్బంది వాహనం అదుపుతప్పి ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలను కూడా రాజ్ భవన్ వర్గాలు తోసిపుచ్చాయి. తనకు ఎస్కార్టుగా వచ్చిన కాంచీపురం పోలీసు వాహనం న్యూ కల్పక్కం వద్ద ఈస్టుకోస్టు రోడ్డులో అదుపుతప్పిందని, అయితే అప్పటికే తమను ఎస్కార్టు వాహనం వదిలి స్టేషన్ కు చేరుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles