Babul Supriyo faces Twitter for sharing fake WhatsApp forward ఏప్రిల్ ఫూల్ అయ్యారా.. మరీ డిసెంబర్ ఫూల్..?

April fooled in december babul supriyo falls for whatsapp forward

Babul Supriyo, WhatsApp forwards, Fake News, internet hoax, union minister, trolled on twitter, whatapp message, fake messages, december april fool, harmless message, errors

Union Minister Babul Supriyo, who was recently trolled for tweeting an unverified WhatsApp forward full of glaring errors

ఏప్రిల్ ఫూల్ అయ్యారా.. మరీ డిసెంబర్ ఫూల్..? కేంద్రమంత్రికి చాన్స్ ఇవ్వరూ..!

Posted: 12/11/2017 04:47 PM IST
April fooled in december babul supriyo falls for whatsapp forward

మీరు ఏప్రిల్ ఫూల్ అయ్యారా..? మరీ డిసెంబర్ ఫూల్.. అదేంటి అలా అడుగుతున్నారు.. ఎక్కడైనా డిసెంబర్ ఫూల్ వుందా...? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా..? ఏప్రిల్ ఫూల్ వున్నప్పుడు.. డిసెంబర్ ఫూల్ ఎందుకు వుండదు..? అని వాదించేవాళ్లూ కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ ఎందుకు చేస్తారన్న మ్యాటర్ లోకి ఎంటర్ కాకుండానే విషయంలోకి వస్తున్నాం.. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కొన్ని ఫార్వ‌ర్డ్ మెసేజ్ లు కొన్ని జనాలను అలోచనలో పడేలా చేస్తాయి.

అయితే అలాంటి వాటిని సరిచూసుకోకుండా అలాగే ఫార్వడ్ చేస్తే.. అబాసుపాలు కాకతప్పదు. మరీ ఇలాంటి మెసేజ్ లను ఎక్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్న సెలెబ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఫార్వ‌ర్డ్ చేస్తే ప‌రువుకు నష్టం. అంతేకాదు ఇంత పెద్ద సెలబ్రిటీగా వున్నారు.. మీకు ఈ మాత్రం తెలియదా అని కూడా నెట్ జనులు పరువు తీసేస్తుంటారు. అలా ఓ ఫార్వ‌ర్డ్ మెసేజ్‌ను ట్వీట్ చేసి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ఫూల్ అయ్యారు. ఇక్క‌డ ప్ర‌త్యేక‌త ఏంటంటే... ఫూల్ అయిన‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా ఒప్పుకున్నారు కూడా!

‘వచ్చే ఏడాది జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చి 3, ఏప్రిల్‌ 4, మే 5.. ఇలా డిసెంబర్‌ 12 వరకు అన్ని తేదీలు ఆదివారం అవుతున్నాయి’ అని ఉన్న ఓ మెసేజ్‌ను బాబుల్ ట్వీట్ చేశారు. అయితే జ‌నవరి 1 ఈసారి సోమవారం అవుతుంది. ఈ విష‌యాన్ని నెటిజ‌న్లు వెంట‌నే ట్వీట్ కింద కామెంట్లు చేశారు. ఇలాంటి న‌కిలీ వార్త‌లు షేర్ చేసేముందు ఒకసారి చెక్‌ చేసుకోవాలని, వెంట‌నే ట్వీట్ డిలీట్ చేయాల‌ని చెప్పారు. అయితే దానికి మంత్రి స్పందించిన తీరు చాలా ఆక‌ట్టుకుంటోంది.

ఎవరో ఇలాంటి నకిలీ మెసేజ్ ను సృష్టించారు. చాలా కోపం వచ్చింది. కానీ, మీరు చెప్పినట్లు నేను ఈ ట్వీట్‌ను తొలగించను. ఎందుకంటే మనమందరం తప్పులు చేస్తుంటాం. లేదంటే డిసెంబరులో ఏప్రిల్‌ ఫూల్‌ అవుతుంటాం. ఈ మెసేజ్‌ వల్ల నేను ఫూల్‌ అయ్యానని ఒప్పుకొంటున్నాను’ అని బాబుల్‌ సుప్రియో ట్వీట్‌ చేశారు. దీనిపై కూడా నెట్ జనులు ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. మంత్రిగారు తమ వాదనను సమర్థించుకునేందు ఇలాంటి అవకాశాన్ని ఎప్పట్నించో వెతుకుతున్నట్లు వుందని, కొందరు.. అర్రే మంత్రిగారు డిసెంబర్ ఫూల్ చేస్తానంటే.. ఛాన్సు ఇవ్వరేం అని మరికొందరు ట్రాల్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles