hyderabad metro rail inaugurated by PM Modi హైదరాబాద్ మెట్రో రైల్ ను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని

Pm modi inagurates hyderabad metro rail

metro rail charges review, metro charges should be reviewed, metro rail charges review, high metro rail charges, metro rail common man, metro rail taxi rates, metro rail auto charges, Prime Minister Narendra Modi, PM modi, hyderabad metro rail, metro train Shedule, metro rail services, metro rail charges, pm modi metro rail, miyapur, kukatpally, metro rail project, telangana

Prime Minister Narendra Modi inaugurated the first leg of the Hyderabad Metro rail project from the Miyapur rail station.

హైదరాబాద్ మెట్రో రైల్ ను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని

Posted: 11/28/2017 02:34 PM IST
Pm modi inagurates hyderabad metro rail

హైదరాబాద్ నగరవాసులు గతకొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కలల రైలు కదిలింది. భాగ్యనగరానికి మణిహారంలో మారనున్న మెట్రో రైలును ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభించారు. రూ. 16 వేల 830 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో నిర్మించిన, దేశంలోనే అతిపెద్ద మెట్రోగా కీర్తినందుకున్న హైదరాబాద్ మెట్రోను ఇవాళ ప్రధాని జాతికి అంకితమిచ్చారు.

మియాపూర్ నుంచి కుకట్ పల్లి వరకు రైలులో ప్రయాణించిన ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రధాని ప్రారంభించి ప్రయాణించిన హైదరాబాద్ మెట్రో అధికారక తొలిరైలును మహిళా లోకో పైలెట్ ప్రారంభించింది. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, బీజేపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు ప్రయాణించారు. అంతకుముందు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద పైలాన్ అవిష్కరించారు.

ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బయలేదేరిన ప్రధాని మధ్యాహ్నానికి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్ల ద్వారా మియాపూర్ చేరుకున్న ప్రధాని.. అక్కడ మెట్రో ఫైలాన్ ను అవిష్కరించారు. అనంతరం మెట్రో రైల్ అధికారులు తయారు చేయించిన మెట్రో రైలు బ్రోచర్ ను, తెలంగాణ ప్రభుత్వం తయారు చేయించిన టీ సవారీ యాప్ ను కూడా ప్రధాని ప్రారంభించారు.

గవర్నర్ తో ఏకాంతంగా ప్రయాణం..? ఏమీటో మ్మరం

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఛాపర్ ద్వారా వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ తో పాటు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ కూడా వచ్చారు. అయితే ఛాపర్ దిగిన తరువాత హెలిఫ్యాడ్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద పైలాన్ వద్దకు చేరుకునే క్రమంలో ప్రధాని మోడీతో పాటు కేవలం గవర్నర్ నరసింహన్ మాత్రమే ఆయన ప్రయాణిస్తున్న కారులో వచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ కు మధ్య రహస్య మంతనాలు జరిగాయని, అవేంటోనని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

మెట్రో రైలు ప్రారంభానికి ముందు.. వేచిన ప్రధాని..

మెట్రో రైలు పైలాన్ అవిష్కరించిన ప్రధాని నరేంద్రమోడీ, అనంతరం మెట్రో రైలును ప్రారంభించారు. అయితే మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు చేతిలో కత్తెర పట్టుకున్న ప్రధాని అటు ఇటు చూడటం అందిరిలో ప్రశ్నలను లేవనెత్తింది. అయితే అప్పటి వరకు వెనకే వున్న తెలంగాణ సీఎం తనయుడు, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్  అప్పుడే కాసింత వెనక్కు వెళ్లారు. దీంతో కేటీఆర్ ఎక్కడ అని అడిగిన ప్రధాని ఆయన తన పక్కకు చేరుకున్న తరువాత మెట్రో రైలును ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  metro rail  charges  review  ts government  ktr  kcr  metro rail officials  hyderabad metro rail  

Other Articles