telugu states shiver with dip in mercury తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా..

Telugu states shiver witnessing low temperatures

telugu states, low temperatures, dip in mercury, andhra pradesh, telangana, telugu states shiver with low temperatues, north india, cold wave

telugu states witness very low temperatures as there is a gradual fall in mercury, Its because of cold winds waves rock from northern states.

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా..

Posted: 11/28/2017 11:40 AM IST
Telugu states shiver witnessing low temperatures

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతుంది. అటు అదిలాబాద్ తో పాటు ఇటు విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయులకు చేరడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో విశాఖ మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీల కనిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. అటు తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలోనూ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

విశాఖ ఏజెన్సీలోని మోదకొండమ్మ పాదాలులో అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, లంబసింగి, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 10 డిగ్రీలు, అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలో మెదక్ లో 11 డిగ్రీలు, ఖమ్మంలో 14 డిగ్రీలు, భద్రాచలంలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హైదరాబాద్‌ సహా హన్మకొండ, హకీంపేట, నిజామాబాద్, రామగుండంలలో 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఏపీలోని మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 12 నుంచి 18 డిగ్రీలకు చేరింది. సమీప భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరింతగా తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా ఉదయం స్యూరుడు వచ్చిన తరువాత కూడా మంచు తిన్నెరలు వదలకపోడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇదిలావుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే నమోదువుతున్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీలు.. హకీంపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ లలో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles