Ramachandra Guha slams IndiGo staff తీరు మారని ఇండిగో.. చరిత్రకారుడికి అవమానం..

Ramachandra guha slams indigo staff for unprovoked rudeness

Society,Indigo Airlines,IndiGo controversies,Ramachandra Guha,Indigo staff misbehaves with Ramachandra Guha,Ramachandra Guha Indigo complaint,Unprovoked rudeness,Indigo staff rude,Indigo staff misbehaves with woman passenger,Indigo staff assaults passenger,Indigo suspends staffers

Now noted historian Ramachandra Guha has slammed the IndiGo airline staff on Twitter for their “unprovoked rudeness”.

తీరు మారని ఇండిగో.. చరిత్రకారుడికి అవమానం..

Posted: 11/27/2017 04:56 PM IST
Ramachandra guha slams indigo staff for unprovoked rudeness

దేశవాళీ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ యాభై ఏళ్ల వ్యక్తిపై దాడి చేసిన అపఖ్యాతిని పోగొట్టకునే లోపు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూను కూడా అవమానించి వార్తల్లో నిలిచింది. ఇదిలా వుండగానే మరో ఘటనలో ఓ మహిళా వికలాంగురాలి పట్ల.. వరస తప్పులు చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నా ఇండిగో యాజమాన్యం మాత్రం తన తీరులో కానీ తన సిబ్బంది వ్యవహరశైలిలో కాని మార్పును తీసుకురాలేకపోతుంది.  

తాజాగా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను ఇండిగో ఉద్యోగులు అవమానించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పటివరకూ తన పట్ల ఇండిగో ఉద్యోగులు మూడుసార్లు ఎయిర్ పోర్టుల్లో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఒకే ఎయిర్ లైన్స్ కు చెందిన ఉద్యోగులు వేర్వేరు విమానాశ్రయాల్లో ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇది తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు.

వాస్తవానికి ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు తాను ట్విట్టర్ ను వాడుకోబోనని, అయితే, వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు అనుచితంగా ప్రవర్తించిన ఇండిగో వైఖరిని నలుగురికీ తెలియజేయాలనే ఈ పని చేశానని అన్నారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఇండిగో ఉద్యోగుల ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదని ఫిర్యాదు చేశారని అన్నారు. కాగా ఓ నెట్ జునుడు మాత్రం.. ప్రయాణికులపై దాడులు చేయడం, అనుచితంగా ప్రవర్తించడంలో యునైటెడ్ ఎయిర్ లైన్స్, ఇండిగో ఒకే విధంగా ప్రవర్తిస్తున్నాయని, భవిష్యత్తులో ఈ రెండు సంస్థలూ విలీనమై చరిత్ర సృష్టించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramachandra Guha  Indigo  Indigo airline  Guha  Airline  

Other Articles