Rs 2 Lakh Cash Robbed From BJP MP Car బీజేపి ఎంపీ కారు నుంచి రూ. 2 లక్షలు చోరి..

Rs 2 lakh cash robbed from parked car of up bjp mp yashwant singh

Rs 2 lakh, Rs 2 lakh robbed, Rs 2 lakh robbed from BJP MP car, uttar pradesh bjp mp, BJP MP Yashwant Singh, bjp mp looted in new delhi, Unidentified men robbed rs 2 lakh from mp car, Chandni Chowk, new delhi, crime

Rs 2 lakh was robbed from parked car of Yashwant Singh, the Bharatiya Janata Party (BJP) from Uttar Pradesh, on Friday in New Delhi.

బీజేపి ఎంపీ కారు నుంచి రూ. 2 లక్షలు చోరి..

Posted: 11/24/2017 10:33 AM IST
Rs 2 lakh cash robbed from parked car of up bjp mp yashwant singh

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ అధికార పార్టీ ఎంపీకి దేశ రాజధాని ఢిల్లీలో పరాభవం ఎదురైంది. ఆయన తన కారులో వుంచిన నగదును కొందరు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఢిల్లీలోనిని చాందినీ చౌక్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఎంపీదని తెలియని దొంగలు కారులో వున్న బ్యాగును గమనించి దానిని ఎత్తుకెళ్లారని తెలుస్తుంది. అయితే నగదు చోరి చేసుందుకు దొంగలు కారును కూడా ధ్వంసం చేశారు.

పనిపై బయటకు వెళ్లేందుకు పార్కు చేసిన కారు వద్దకు చేరుకున్న ఎంపీ యశ్వంత్‌ సింగ్‌.. కారు ధ్వంసం చేయబడి వుండటంతో చోరి జరిగిందని అప్రమత్తమై.. కారు తెరచి చూడగా.. అందులో వుంచిన రూ.2లక్షల నగదును దుండగులు దొంగిలించారు. దొంగతనం విషయం గుర్తించిన ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఎంపీ యశ్వంత్ సింగ్ కారులో రెండు లక్షల కన్నా ఎక్కువగానే నగదు వుందని సమాచారం. కాగా, అ వివరాలను తెలిపితే అర్థికసంస్కరణల నేపథ్యంలో నూతనంగా బీజేపి ప్రభుత్వం తీసుకువచ్చిన అర్థిక బిల్లుకు తూట్లు పోడిచారని విపక్షాల విమర్శలకు తోడు. బిల్లు మేరకు అయనపైనే కేసు నమోదు చేయాల్సి వస్తుందని భావించిన పోలీసులు.. కేవలం రూ.2 లక్షలు మాత్రమే దొంగలించబడిందని చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandni Chowk  Delhi  Robbery  Rs 2 lakh cash  Yashwant Singh  delhi  crime  

Other Articles