RK Nagar bypoll on December 21 అర్కే నగర్ ఉపఎన్నికకు మోగిన నగరా..!

Bypoll to jayalalithaa s rk nagar assembly seat on dec 21

aiadmk, E Palaniswami, chief minister, sasikala, jayalalithaa, rk nagar by elections, rk nagar bypolls, rk nagar, party symbol two leaves, voter bribery, C Vijayabaskar, TTV Dinakaran, O Panneerselvam, by election, election commission, tamil nadu, Arunachal Pradesh, Uttar Pradesh

The bypoll to RK Nagar constituency, which fell vacant following J Jayalalithaa’s death last year, will be held on December 21 and the votes will be counted on December 24, the Election Commission announced on Friday.

‘అమ్మ’ అర్కే నగర్ ఉపఎన్నికకు మోగిన నగరా..!

Posted: 11/24/2017 11:24 AM IST
Bypoll to jayalalithaa s rk nagar assembly seat on dec 21

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో సరిగ్గా అమె మరణించిన ఏడాది తరువాత మళ్లీ ఉప ఎన్నికల నగరాను మ్రోగించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఏడాది ఏప్రిల్ 12న జరగాల్సిన ఎన్నికలు సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎన్నికల సంఘం అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నియోజకవర్గం ఓటర్లకు ఇవాళ సీఈసీ ఎన్ఎన్నికల తేదీని ప్రకటించింది.

అర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేసి ఇవాళ ప్రకటించింది. డిసెంబర్‌ 21న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఇవాలే ప్రకటించింది. డిసెంబర్‌ 21న ఎన్నిక నిర్వహించి.. 24న కౌటింగ్‌ నిర్వహించనున్నారు. కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా అర్కేనగర్ ఉపఎన్నికలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సికంద్రా, పశ్చిమ బెంగాల్ లోని సంబంగ్‌ అసెంబ్లీ నియోజకవర్గం.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పక్కే కసంగ్‌, లికబలి నియోజకవర్గాలకు కూడా అదే తేదీలో ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఆర్కే నగర్‌ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న నిర్వహించిన ఉపఎన్నికలలో ముఖ్యమంత్రి పళనిస్వామి శశికళ వర్గానికి చెందిన అభ్యర్థి టీటీవీ దినకరన్ కు మద్దతు ప్రకటించారు. అయితే తాజాగా దినకరణ్ వర్గం వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కోంటూ ఒంటరిగా మిగిలింది. దీంతో రాష్ట్రంలో రెండు వర్గాలుగా చీలిన పళినిస్వామి, పన్నీరు వర్గాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. నిన్ననే ఎన్నికల కమీషన్ రెండు అకులు గుర్తును కూడా ఈ వర్గానికే కేటాయింది.

దీంతో ఇప్పటికే నైతిక విజయాన్ని అందుకున్నామని విజయోత్సాహంలో వున్న అధికార వర్గం.. ఎన్నికలలో ఎలా పాపులను కదుపుతుందన్నది కూడా చర్చనీయాంశంగానే మారింది. అయితే గతంలో అధికార పక్షంలో మంత్రిగా కొనసాగిన తమిళనాడు అరోగ్యశాఖ మంత్రి సి విజయ్ భాస్కర్, అయన అనుచరుల నుంచి సుమారుగా 89 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. మరి ఇప్పుడు అధికారపక్షం అలాంటి చర్యలకు పాల్పడితే అలాంటి చర్యలనే తీసుకునే సహాసం చేస్తారా.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles