Snake found on commuter train సోషల్ మీడియాలో హీరోగా మారిన యువకుడు.

Man kills snake found on commuter train in indonesia

Indonesian man, bare hands, snake, packed commuter train, passengers, mobile phone, social media, viral video, video viral

An Indonesian man used his bare hands to kill a snake that was found on a packed commuter train as startled passengers hid behind him.

ITEMVIDEOS: సోషల్ మీడియాలో హీరోగా మారిన యువకుడు.

Posted: 11/23/2017 06:11 PM IST
Man kills snake found on commuter train in indonesia

ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అ సామెతను బాగా వంటపట్టించుకున్న యువకుడు ఏకంగా రద్దీ ఉండే ఓ రైల్లో ప్రయాణికుల హాహాకారాల మధ్య తన ధైర్యాన్ని ప్రదర్శించి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. అదేంటి రైల్లో హీరోగా కావడం ఎలా..? అంటారా..? గమ్యస్థానాలు చేరేందుకు రైలు ఎక్కిన ప్రయాణికులను ఓ పాము పరుగులు పెట్టించింది. అయితే అందరూ చూస్తుండగానే ఇండోనేసియా యువకుడు దాన్ని ఒంటిచేత్తో పట్టిచంపేసి హారో అయ్యాడు.

రైలు బ్యాగేజి ర్యాక్‌లో నక్కిన భారీ పామును అలవోకగా నిలువరించిన ఇతగాడు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హీరో అయిపోయాడు. ఇండోనేసియాలోని బోగోర్ నుంచి జకార్తా వెళ్లుతున్న రైల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు హాహాకారాలు చేయడతో భద్రతా సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి పాముకోసం వెదకడం ప్రారంభించారు. అయితే అది బ్యాగేజీ ర్యాక్‌లోని లగేజీ మధ్య నక్కింది.

దీన్ని గమనించిన సదరు యువకుడు అలవోకగా పాము తోకపట్టుకుని కిందికి లాగాడు. అదేపాటున దాని తలను ఫ్లోర్‌కేసి బాదాడు. అంతే మూడు మీటర్లకు పైగా ఉన్న ఆ పాము కథ సుఖాంతం అయ్యింది. అనంతరం ఆ యువకుడు పామును రైలు బయట ఎదురుచూస్తున్న భద్రతా సిబ్బంది వైపు తోసేశాడు. ఓ ప్రయాణికుడి బ్యాగు ద్వారా పాము రైల్లోకి వచ్చిఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indonesian man  bare hands  snake  train  passengers  mobile phone  social media  viral video  

Other Articles