Girl's suicide: Tension on Sathyabama university విద్యార్థిని బలవన్మరణం.. యూనివర్సిటీలో విధ్వంసం

Violence breaks out at sathyabama university after student s suicide

Sathyabama University, Duvvuru Monica Reddy, monica reddy copied, chemistry exam, lecturer, humiliation, Chennai, Arson, student suicide, students rampage chennai, violence sathyabama university, Chennai, violence, crime

Violence erupted at Sathyabama University in Chennai on Wednesday night after a first-year student, who was allegedly caught cheating during an examination, committed suicide

విద్యార్థిని బలవన్మరణం.. యూనివర్సిటీలో విధ్వంసం

Posted: 11/23/2017 10:43 AM IST
Violence breaks out at sathyabama university after student s suicide

చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు విద్యార్థులతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు కూడా ఈ పెను విధ్వంసం సృష్టించారు. యూనివర్షిటీలోని లెక్చరర్ల వేధింపులకు నిరసనగా విద్యార్థులు ఈ హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. హైదరాబాదుకు చెందిన రాధమౌనిక అనే విద్యార్థిని లెక్చరర్ వేధింపులు భరించలేక.. ఆత్మహత్యకు పాల్పడటంతో అగ్రహానికి గురైన విద్యార్థులు హింసాకు తెగబడ్డారు. యూనివర్సిటీ సహా హాస్టల్ క్యాంపస్ లలో విధ్వంసాలను సృష్టించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సత్యభావ యూనివర్సిటీలో హైదరాబాద్ కు చెందిన దువ్వూరి రాధమోనికా రెడ్డి కంప్యూటర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షలో కాపీకి పాల్పడిందంటూ పరీక్ష హాల్ నుంచి ఆమెను కాలేజీ ఫ్రోఫెసర్లు బయటకు పంపించేశారు. అనంతరం ఇతర పరీక్షలు రాసేందుకు కూడా ఆమెకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు అమెను విద్యార్థులందరి ఎదుట అవమానించడంతో అమె పరాభవానికి గురైంది. మానసిక వేధనకు గురైన అమె 'మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్' అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 అంతకు ముందు, అదే కళాశాలలో చదువుతున్న సోదరుడితో వీడియో కాల్ మాట్లాడింది. దీంతో ఆమెను అనునయించడానికి హుటాహుటీన ఆమె ఉంటున్న హాస్టల్ కు చేరుకున్న సోదరుడ్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అతను ఎంత ప్రాధేయపడినా వారు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె ఆత్మహత్యను ఆపలేకపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తెలుగు విద్యార్థులు కళాశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. యూనివర్సిటీ బస్సులకు నిప్పుపెట్టారు. మంటలు ఎగసిపడడంతో వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రాగా, వారిని విద్యార్థులు అడ్డుకున్నారు.

తెలుగు విద్యార్థులతో పాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న అమె స్నేహితులు, క్లాస్ మేట్స్ అందరూ విధ్వంసానికి పాల్పడటంతో.. ఎట్టకేలకు యూనివర్సిటీ యాజమాన్యం దిగివచ్చింది. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. విద్యార్థిని ప్రాణాలు పోతున్నాయన్నా.. కనికరించని సెక్యూరిటీపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయినా విద్యార్థులు శాంతించకపోవడంతో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. జనవరి 1 వరకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. తక్షణం విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో విద్యార్థులు ఇళ్ల బాటపట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles