Airline staffer gets man to touch her feet ఆకతాయి బుద్ది చెప్పిన యువతి.. వీడియో వైరల్

Bravo indigo female staff makes two drunkards fall at her feet

Engineering Students, RGIA, Air Hostess, Hyderabad, Misbehave, Hyderabad airport, Safety of women, Crimes against women, woman staffer assaulted, IndiGo staffer, hyderabad, crime

An IndiGo employee confronted drunk man who allegedly misbehaved with her at the Rajiv Gandhi International Airport at Hyderabad, took them to the police outpost and made them touch her feet to apologise.

ITEMVIDEOS: ఫ్లైట్ అటెండంట్ కాళ్లు పట్టుకున్న ఆకతాయిలు

Posted: 11/20/2017 03:43 PM IST
Bravo indigo female staff makes two drunkards fall at her feet

హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. విమానాశ్రయిం పోలీసు అవుట్ పోస్టులో జరిగిన ఘటనలో యువతి ధైర్యాన్ని మొచ్చుకుంటున్న నెట్ జనులు అదే సమయంలో ఆకతాయిల విపరీత చేష్టలపై మండిపడుతున్నారు. ఈ మొత్తం ఘటనను ఎవరు తమ సెల్ ఫోన్ లో బంధించి..సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా ఇప్పుడు సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే ఇండిగో విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న ఓ యువతి.. రాత్రి వేళ తన విధులను ముగించుకుని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చింది. పార్కింగ్ ప్లేస్ లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు.. అమెతో అసభ్యంగా ప్రవర్తించారు. మరో విధంగా అమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మరో యువకుడు అమెను అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు పిర్యాదు చేసింది. వెంటనే అక్కడున్న యువకులను ఓ పోలీసు కానిస్టేబుల్ వచ్చి అదుపులోకి తీసుకున్నాడు.

పోలీసులు చేతికి చిక్కడంతో తమ పని అయిపోయిందని భావించిన యువకులు ఎయిర్ హాస్టస్ ను విడిచిపెట్టమని బతిమాలారు. తెలియక తప్పు చేశామని ప్రాధేయపడ్డారు. పోలీస్ ఔట్ పఓస్టు వరకు అలాగే బతిమాలుతూ వచ్చారు. ఈ లోగా అక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా గుమ్మిగూడారు. దీంతో పోలిస్ స్టేషన్ లోకి వెళ్లిన యువకుడు అమెను ప్రాథేయపడటంలో అమె తన కాళ్లు పట్టుకుని క్షమాపణ చేప్పాలని లేదంటే కేసు పెట్టి చంపుతానని చెప్పింది.

దీనికి సమ్మతించిన యువకుడు ఒంగి కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసినా అమె తన కాళ్లును ముట్టుకోవాలని చెప్పడంతో ఇక లాభం లేదని అమ్మాయి కాళ్ల ముందు వంగి సారీ చెప్పాడు. అలా కాదు.. బెండ్ డౌన్.. బెండ్ డౌన్.. అప్పుడే వదిలేస్తా అని బెదిరించింది. కాళ్లు పట్టుకో.. నా కాళ్లకు చేతులు టచ్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ యువకుడు అందరి ముందు కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాడు. ఈ ఘటనపై ఎయిర్ పోర్ట్ ఇన్ స్పెక్టర్ స్పందిస్తూ.. దీనిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. ఎయిర్ హోస్టస్ కూడా కంప్లయింట్ ఇవ్వలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles