Strong Earthquake has jolted China's Tibet region | భారత్-టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం.. నష్టం ఎందుకు అంచనావేయలేకపోతున్నారంటే...

Earthquake at tibet india border

Tibet Earthquake, Southwest China Earthquake, Earthquake in Tibet, China-India Border Earthquake

Powerful 6.9 magnitude earthquake hits southern China near Indian border It was not immediately known if the quake had caused any damage or casualties but the Xizang area of China is sparsely populated.

దక్షిణ చైనా-భారత్ సరిహద్దులో భారీ భూకంపం

Posted: 11/18/2017 09:33 AM IST
Earthquake at tibet india border

భారత్-చైనా సరిహద్దులో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. టిబెట్-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో 4గం34ని ప్రకపంనలు వచ్చినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. తీవ్రత రిక్చర్ స్కేలుపై 6.9గా నమోదైంది. టిబెట్ లోని యింగ్ చి ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయ్యింది. ఇదే తీవ్రతతో రెండు సార్లు భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. తరువాత పలు మార్లు ప్రకంపనలు సంభవించినట్టు సమాచారం.

భారత్ సరిహద్దులో ఇది నిర్మానుష్య.. కొండ ప్రాంతాలు కావటంతో నష్ట తీవ్రత ఉండకపోవచ్చనే అధికారులు భావిస్తున్నారు. మరోపక్క వేకువ జామున కావడంతో నిద్రలో ఉన్నకారణంగా పలువురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క దక్షిణచైనాలో సహయకచర్యలు ప్రారంభమయ్యాయి. భూకంప కేంద్రం నింగ్చ్యి అనే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. భూగర్భంలోని పది కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో అతితక్కువ మానవసంచారం ఉన్నప్పటికీ.. అక్కడక్కడా ఇళ్లులు నిర్మించుకని పలువురు నివసిస్తున్నారు. దీంతో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉందని చెప్పింది.

కాగా, ఈ సరిహద్దులో భూకంపం వస్తే దాని నష్టం గతంలో తీవ్రంగా ఉండేది. 1950లో అస్సాం-టిబెట్ సరిహద్దులో 8.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. ఆ సమయంలో 4,800 మంది మృత్యువాత పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earthquake  Tibet  China-India Border  

Other Articles