Beloved Gary the Goat dies suddenly | ఇంటర్నెట్ సంచలనం గేరీ కన్నుమూత

Gary the goat has died

Gary The Goat, Gary Owner, Australia Goat, Jim Dezarnaulds, Jimbo Baboozi, Comedy Goat Died, Gary Passes Away, Sensational Goat Died, social media Gary, Gary Death Mourns

Gary The Goat, Internet-Famous Giver Of Zero Fucks, Has Died Aged Six. Internet sensation Gary the goat dies on tour in Queensland, thousands of fans mourn on social media. comedian Jim Dezarnaulds, also known as Jimbo Baboozi, were on tour in regional Queensland at the time of Gary's passing.

ఇంటర్నెట్ సంచలనం గేరీ కన్నుమూత

Posted: 11/18/2017 08:42 AM IST
Gary the goat has died

ఇంటర్నెట్ సంచలనం గేరీ ఇక లేదు. ఫేస్ బుక్ లో 1.7 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న గేరీ ఓ మేక. అసలు దానికి అంతలా ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందో తెలియాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.

సిడ్నీ మ్యూజియం బయట ఉన్న పూలను తినేయడంతో దాని యజమానికి 440 డాలర్లు జరిమానా విధించారు. దీంతో గేరీ ఓనర్ న్యాయపోరాటానికి దిగి విజయం సాధించాడు. ఆ సమయంలో గేరీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దాని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాని క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ ట్రావెలింగ్ కామెడీ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. దీంతో జేమ్స్ బెజార్డ్నౌల్డ్స్ద్-గేరీ ద్వయం పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది.

ఏకంగా 17 లక్షల మంది ఫాలోవర్లుగా మారిపోయారు. కొందరైతే దాని ఫొటోలను తమ శరీరంపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు. అయితే గత కొంత కాలంగా అది ట్యూమర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవార ఉదయం గేరీ కన్నుమూసింది. దాని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంతాపం తెలుపుతూ సందేశాలు పంపారు. ట్యూమర్‌కు దీర్ఘకాలంగా చికిత్స ఇప్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, అది కానరాని లోకాలకు వెళ్లిపోయిందని దాని నటుడు బెజార్డ్నౌల్డ్స్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలా ఓ మేక తాను చనిపోతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles