NGT appoints panel on Amarnath Yatra పరమశివుడి మాటలను వినాలంటే..

Ngt slams amarnath shrine board over lack of amenities

devotees, Vaishno Devi, National Green Tribunal (NGT), Amarnath Shrine Board, safety, security, Facilities, Swatanter Kumar, Shri Amarnathji Shrine Board, Supreme Court, Waste Management, toilets, Amarnath Yatra

The bench directed the Shri Amarnathji Shrine Board to submit a report by the first week of December on compliance of the Supreme Court's directions, passed in 2012.

ఆదాయంపైనే ద్యాస.. భక్తులకు ఏర్పాట్లపై లేదా..?

Posted: 11/16/2017 02:02 PM IST
Ngt slams amarnath shrine board over lack of amenities

ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణో దేవి ఆలయ సందర్శనకు పరిమితులు విధిస్తూ ఆదేశాలు జారీచేసిన జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తాజాగా అమర్ నాథ్‌ ఆలయాన్ని సైలెంట్‌ జోన్ గా ప్రకటించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పరమశివుడు హిమలింగాకారంలోనే కాకుండా.. నిరాకారుడై కూడా ఇక్కడ నెలవై వుంటాడన్న భక్తుల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఈ మేరకు తీర్పును ఇచ్చిందని భక్తులు కోనియాడుతున్నారు.

దేశంలో ఇప్పటి వరకు కేవలం సాలగ్రామ లింగాకారం లేదా స్పటిక లింగాకార స్వరూపుడిగా వెలుగొందుతున్న పరమేశ్వరుడు.. అమర్ నాథ్ అలయంలో మాత్రమే హిమలింగాకారుడై భక్తులకు దర్శనం ఇస్తాడని, హిమాలయాలు రుషులు, మునుల తప్పసులకు మెచ్చిన బోలా శంకరుడు వారి కోసం ఇక్కడకు వస్తుంటారని, ఆయన ఇక్కడి నుంచే తన భక్తులతో మాట్లాడతారని, అవి వినాలంటే ఎంతో నిశబ్దంగా వుండాలని.. దానిని గ్రీన్ ట్రిబ్యూనల్ అదేశాలను జారీ చేసిందని భక్తలు విశ్వసిస్తున్నారు.

అయితే ఈ సంరద్బంగా గ్రీన్ ట్రిబ్యూనల్ ఆలయం సమీపంలో కొబ్బరికాయలు కొట్టడం, విరాళాలు విసిరివేయడాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. హిమపాతాన్ని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమర్ నాథ్‌ ప్రాంత పరిరక్షణకు 2012లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ఆలయబోర్డును ప్రశ్నించింది.

అమర్ నాథ్‌ యాత్రకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆదాయంపైనే దృష్టి పెట్టడంపై గ్రీన్ ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తులకు మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటుగా గతంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏ మేరకు అమలు చేశారన్న అంశమై పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే నెల మొదటి వారంలోగా తమకు నివేదిక సమర్పించాలని గ్రీన్ ట్రిబ్యూనల్ అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles