కూరగాయల ధరలెట్ల మండుతున్నయంటే .. అరె అటు కాశ్మీరు, పంజాబ్, పూణే, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, అస్పోం, భువనేశ్వర్, ముంబై, అహ్మదాబాద్, హిమాచల్ ఏ రాష్ట్రామెళ్లినా.. ఏ నగరంలో చూసినా.,. సామాన్యుడి జేబు మాత్రం గుల్లకాక తప్పడం లేదు. అసలు కూరగాయలు కోనేందుకు సామాన్యుడు ఎన్ని అవస్థలు పడుతున్నాడో అర్థంకాకుండా పోయింది. కూరగాయల ధరలు అకాశాన్నంటుతున్న క్రమంలో సామాన్యులు అవి లేకుండానే పూటలు గడుపుతున్నారు.
మొన్న ఘాటు కన్న ధరతోనే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి.. తల్లిని కాకుండా తననే మరిపించేలా చేసింది. ఆ తరువాత అదే బాటలో కొంతకాలం క్రితం టమాటా కూడా నడిచింది. కొన్నాళ్లు వంటింట్లోకి వెళ్లేందుకు కూడా బాధపడిన మహిళలు.. పచ్చళ్లు, పప్పులతోనే పూటలు గడిపేశారు. అయితే తాజాగా అదే బాటలో క్యారెట్ కూడా నడుస్తుంది. మొన్నటి వరకూ కిలో క్యారెట్ 40 రూపాయిలు పలికితే.. ఇప్పుడు సెంచరీకి దగ్గరలో ఉంది. క్యారెట్ దిగుబడి బాగా తగ్గడంతో మార్కెట్లో రేట్లు భారీగా పెరిగాయి. రిటైల్ మార్కెట్ లో కేజీ క్యారేట్ సెంచరీ దాటింది. దీంతో క్యారెట్ కొనాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు.
మొన్నటి వరకూ రైతు బజార్లో కిలో క్యారెట్ 35 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉండేది. ఇప్పుడు కేజీ క్యారెట్ 70 రూపాయిలకు పైనే ఉంది. పోనీ రేటుతో రాజీ పడి కొందామన్నా క్వాలిటీ లేని క్యారెట్ మార్కెట్లో ఉంది. ఇక రిటైల్ మార్కెట్లో కేజీ క్యారెట్ వంద రూపాయలు పలుకుతోంది. దీంతో షుగర్ పేషెంట్స్ క్యారెట్ జ్యూస్ తాగడం ఇబ్బందిగా మారింది. రేటు పెరగడంతో క్యారెట్ కర్రీతో పాటు స్వీట్ కు దూరంగా ఉండాల్సి వస్తుందంటున్నారు జనం.
క్యారెట్ దిగుబడి భారీగా తగ్గడంతో మార్కెట్లో స్టాక్ కనిపించడం లేదు. అరకొరగా మార్కెట్లోకి వచ్చినా అది కూడా క్వాలిటీ ఉండటం లేదు. మొన్నపడిన వర్షాలకు క్యారెట్ సాగు దెబ్బతిందని చెబుతున్నారు రైతులు. ధర ఎక్కువగా ఉండటంతో పాటు క్వాలిటీ లేకపోవడంతో క్యారెట్ అమ్మడమే మానేశామంటున్నారు వ్యాపారులు. పంట దిగుబడి తగ్గి ధరలు పెరిగాయని వ్యాపారులు అంటుంటే..వర్షాలు పడటంతో నష్టపోయామని రైతులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more