Reduced GST rates make food lovers happy విమర్శల ప్రభావం.. తగ్గిన జీఎస్టీ.. రెస్టారెంట్లకు కొత్తకళ.. తగ్గిన జీఎస్టీ.. రెస్టారెంట్లకు కొత్తకళ.. అయితే...

Despite cut in gst rate little change in eating out costs

gst on restaurants in india, gst on restaurant, gst rate on restaurants, gst rates on restaurants, new gst rates on restaurants, gst on ac restaurants, gst rates on restaurants in india, gst on restaurants reduced, GST Rate, Gst Tax Rate, gst rates for restaurants, gst rates revised, Revised GST Tax rates, New GST Rates in India

Eating out in restaurants is set to get cheaper (except of 5-star hotels) as the GST Council recently revised the differential tax rates for restaurants (12% for non-AC and 18% for air-conditioned) to a flat 5%.

తగ్గిన జీఎస్టీ.. రెస్టారెంట్లకు కొత్తకళ.. అయితే...

Posted: 11/16/2017 12:06 PM IST
Despite cut in gst rate little change in eating out costs

భోజన ప్రియులకు కేంద్రం శుభవార్తను అందించగానే ఇటు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు మాత్రం అవకాశం దొరకికింది కదా అంటూ కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టే పనిలో వున్నారు. గత జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానంలో గత ఐదు నెలలుగా బయటకెళ్లి బోజనం చేయాలంటే.. మనీ పర్సులు ఖాళీ అవుతున్నాయని బాధపడిన బోజన ప్రియులు ఇకపై అంతటి అందోళన చెందాల్సిన అవసరం లేకుండా జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త చెప్పింది.

రెస్టారెంట్లలో బోజనాలపై తొలిసారిగా విధించిన 18 శాతం జీఎస్టీని గత కౌన్సిల్ లో ఏసీ రెస్టరెంట్లకు ఒకలా, నాన్ ఏసీ రెస్టారెంట్లకు మరోలా పన్నును విధిస్తూ మొత్తంగా 12 శాతానికి మార్చగా, ఈ సారి దానిని ఏకంగా 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెస్టారెంట్లలో భోజనాన్ని అనునిత్యం అస్వాదించే బోజనప్రియులకు కాసింత లాభంచేకూరనుంది. తమ జేబులు గుల్ల కాకుండా బోజనాలు చేసే అవకాశాన్ని గువాహటిలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

అయితే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) విషయంలో మాత్రం రెస్టారెంట్లకు ఎటువంటి మినహాయింపు కల్పించలేదు. అయితే వినియోగదారులపై ఐటీసీ భారం కూడా పడుతున్న నేపథ్యంలో అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలు.. ఐటీసీని వినియోగదారులపై మోపకుండా దానిని రెస్టారెంట్ యజమానులే భరించేలా సరికొత్త నిబంధన తీసుకొచ్చారు. వినియోగదారులు తిన్న పదార్థాలపై మాత్రమే జీఎస్టీ విధించేలా సవరించారు.

తాజా నిబంధన నేటి నుంచే అమల్లోకి రానుంది. ఇక ఐటీసీ కేవలం తమపైనే పడుతున్న నేపథ్యంలో రెస్టారెంట్లు కూడా మరో అడుగుముందుకేసీ ఇప్పటి వరకు వున్న ధరలను మరింతగా పెంచేశాయి. జీఎస్టీ తగ్గిందన్న అనందంలో వున్న వినియోగదారుడ్ని.. రెస్టారెంట్ల యాజమాన్యాలన్నీ కలసి ఆహార పదార్థాల దరలను పెంచనున్నాయి. దీంతో వినియోగదారుడి జేబుకు చిల్లులు మాత్రం పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gst  eating out  cheaper  restaurants  food lovers  ac restaurants  GST Rate  Gst Tax Rate  Revised GST Tax rates  India  

Other Articles