man wanted 'Mahatma' removed from Gandhi's name finned ‘‘మహాత్మ’’ తొలిగించాలని.. చమురు వదిలించుకున్నాడు..

Court slams man who wanted mahatma removed from before gandhi s name

Madras High Court, currency, notes, PIL, judge, Mahatma Gandhi, 'Mahatma', research scholar, S Muruganantham, Chief Justice Indira Banerjee, Justice M Sundar.

A research scholar was finned by Madras High Court who filed a plea to remove the word 'Mahatma' as a prefix from Gandhi's name.

‘‘మహాత్మ’’ తొలిగించాలని.. చమురు వదిలించుకున్నాడు..

Posted: 11/15/2017 05:17 PM IST
Court slams man who wanted mahatma removed from before gandhi s name

దేశంలోని న్యాయస్థానాల్లో ఇప్పటికే వేల కొలది కేసులు పెండింగ్ లో వున్నాయన్న డైలాడ్ మూడు దశాబ్దాల క్రితం విడుదలైన పలు చిత్రాల్లో వినిపిస్తుంది. మరి మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడు మరెన్నో కేసులు న్యాయస్థానాలకు చేరుతునే వున్నాయి. ఈ క్రమంలో న్యాయస్థానాలకు ( మరీ ముఖ్యంగా తీర్పులను వెలువరించే న్యామూర్తులకు) పనిభారం అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఈ వ్యాఖ్యలను మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులు కూడా పలుమారు వ్యాఖ్యానించారు.

అయితే వీరి పని భారిన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు ప్రభుత్వాలు, సీజేలు చూసుకున్నా.. మనవరకు మాత్రం కూడా కొన్ని పాటిస్తే సరిపోతుందన్నది కాదనలేని  వాస్తవం. అదేంటంటే.. వారికున్న అమూల్యమైన సమయాన్ని వృధా చేసేలా పలు ప్రజావాఖ్యం కేసులను తెరపైకి తీసుకురాకపోతే మంచింది. కానీ ఎంతో ఈజీగా చిన్న పిల్ లో పెద్ద గుర్తింపు తెచ్చుకునేందుకు పలువురు ఈ మార్గాన్ని కూడా ఎంచుకోగా.. అందులో కొన్ని నిజంగానే ప్రజావసరం కోసం ఉపయోగపడగా, కొన్ని మాత్రం సమయాన్ని వృధా చేస్తాయి.

అయితే మహనీయుల అశయాలకు అనుగూణంగా దేశంలోని కరెన్సీపై మహాత్మ గాంధీ అని ముద్రిస్తున్నా.. ఆయన అశయాలకు కరెన్సీ నోట్లు మాత్రం తూట్లు పోడుస్తున్నాయని.. ఈ క్రమంలో దాఖలైన ఓ పిటీషన్ విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చింది. అశయాలు సిద్దంచని పక్షంలో ప్రభుత్వ, పాలకులు చర్యలు తీసుకోవాలి కానీ.. నోటుపై ముద్రించే మహాత్మా గాంధీ పేరు ముందు మహాత్మను తొలగించాలని వాదించారు. ఈ మేరకు రీసెర్చ్ స్కాల‌ర్ ఎస్‌. మురుగ‌నాథం మ‌ద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశాడు.

ఈ పిల్‌పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని జస్టిస్ సుందర్ తో కూడిన ద్విసభ్య బెంచ్.. విచార‌ణ చేప‌ట్టి.. పిల్ ను కొటంటివేసింది. దీంతో పాటు కోర్టు విలువైన స‌మ‌యాన్ని వృథా చేసినందుకు గాను పిటిష‌నర్ పై రూ. 10 వేలు జ‌రిమానా కూడా విధించింది. గాంధీ పేరుకు ముందు 'మ‌హాత్మ' అని ఉప‌యోగించ‌డం రాజ్యాంగంలోని ప్రక‌ర‌ణ 14, 18ల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఎస్‌. మురుగ‌నాథం తన పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. అయితే 'మ‌హాత్మ' అనే బిరుదు ఏదైనా రాష్ట్రం గానీ, దేశం గానీ ఇవ్వలేద‌ని, ఆ బిరుదును ర‌వీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చింది కావ‌డం వ‌ల్ల రాజ్యాంగానికి విరుద్ధంకాద‌ని కోర్టు వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madras High Court  currency  notes  PIL  judge  'Mahatma'  research scholar  S Muruganantham  

Other Articles