Stalker Sets young girl and her family on fire ప్రమోన్మాది ఘాతుకం.. కుటుంబంపై సజీవదహన యత్నం..

Stalker sets young girl and her family on fire

Stalking, induja, Chennai techie, Stalker aakash, aakash, Adambakkam, AGS Colony, Saraswathi Nagar, Renuka, Nivedha, Kilpauk Medical College (KMC) hospital, chennai, tamil nadu,. crimeStalking, induja, Chennai techie, Stalker aakash, aakash, Adambakkam, AGS Colony, Saraswathi Nagar, Renuka, Nivedha, Kilpauk Medical College (KMC) hospital, chennai, tamil nadu,. crime

In a shocking incident of a stalker who went on a killing spree, a man in Chennai set the family of a woman on fire. Aakash, who used to study with Indhuja, an engineering graduate, had been stalking her for over a month

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి, అమె కుటుంబంపై సజీవదహన యత్నం..

Posted: 11/15/2017 06:04 PM IST
Stalker sets young girl and her family on fire

చెన్నైలోని ఆదంబాక్కంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అమెదించడానికి నిరాకరించిన యువతితో పాటు అమె తల్లిని, చెల్లిని కూడా అంతం చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ప్రియురాలు సజీవదహనం కాగా, అమె తల్లి, చెల్లి మాత్రం తీవ్రంగా గాయపడి అస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. వారి పరిస్థితి విషమంగానే వుందని వైద్యులు తెలిపారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయి తనను పెళ్లి చేసుకోనని పలుమార్లు కోరినా తిరస్కరించినందుకే దారుణానికి పాల్పడ్డానని వాంగ్మూలం ఇచ్చాడు.

ఘటన వివరాల్లోకి వెళ్తే...  సేలంకు చెందిన షణ్ముగం (50), రేణుక (42) దంపతుల కుటుంబం చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్‌ ఏడో వీధిలో స్థిర పడింది. వీరికి ఇందుజా (22), నివేద (20), మనోజ్‌ (15) అనే పిల్లలున్నారు. పెద్దకుమార్తె ఇందుజా స్థానికంగా ఓ సాప్ట్ వేర్ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే తనతో పాటు గిండిలోని ఓ ప్రముఖ స్కూల్‌ లో చదువుకున్న వేళచ్చేరికి చెందిన ముత్తుకుమార్‌ కుమారుడు ఆకాష్‌ (24) అమెను గత కొన్ని రోజులుగా వెంబడిస్తూ తనను ప్రేమిస్తున్నానని చెబుతూ వెంటపడ్డాడు.

పాఠశాలలో ఒకే తరగతిలో చదువుకున్న చనువుతో కొంత సన్నిహితంగా మెదిలితే.. అదే ప్రేమ అని బావించిన యువకుడు అమె వెంటపడి వేధించసాగాడు. అయితే అకాష్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇందుజపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ప్రేమోన్మాదిగా మారిన అకాస్.. ప్లాన్ ప్రకారం టర్పంటైల్ క్యాన్ తో ఆమె ఇంటికి చేరుకున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమె ఇంటి తలుపుతట్టాడు. ఇందూజ తల్లి వచ్చి తలుపు తెరిచింది. ఓ సారి ఇందుజతో మాట్లాడి వెళ్తానని చెప్పడంతో.. లోనికి రానిచ్చింది రేణుక.

అంతే అక్కడే దాచిన క్యాన్ ను బయటకు తీసి, క్షణాల్లో ఇంట్లోకి దూరి, ఇందూజ మీద పోశాడు. అతనిని అడ్డుకునేందుకు వచ్చిన ఆమె తల్లి, చెల్లి మీద కూడా పోసి, నిప్పంటించాడు. మంటలు క్షణాల్లో ఆవహించాయి. ఇంట్లో ఉన్న మనోజ్ వచ్చేసరికి ఆకాశ్ పారిపోయాడు. వారి కేకల్ని విన్న ఇరుగుపొరుగు వచ్చి, వారిని రక్షించే ప్రయత్నం చేసేలోపు ఇందూజ సజీవదహనమైంది. తీవ్రగాయాలపాలైన రేణుక, నివేదలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆకాశ్ ఆదంబాక్కం పోలీసుల స్టేషన్ లో లొంగిపోయాడు. అనంతరం తన ప్రేమ పయనం నుంచి ఉన్మాదం వరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి నేరాన్ని అంగీకరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stalking  induja  Chennai techie  aakash  Adambakkam AGS Colony  chennai  tamil nadu  . crime  

Other Articles