maggots found in kfe chicken by customer మళ్లీ వార్తల్లోకి కెఎఫ్‌సీ.. ఈ సారి ఏకంగా చికెన్ లోంచి..

Melbourne man shocked to notice maggots in kfc chicken

KFC, kentuky fried chicken, maggots, fried flesh, babu shower, Roxburgh Park, melbourne, australia

Customer brought a box of KFC chicken to a baby shower. fter everyone finished their meals a small boy at the party noticed the maggots. It comes just a day after another woman found critters in her fried chicken

ITEMVIDEOS: మళ్లీ వార్తల్లోకి కెఎఫ్‌సీ.. ఈ సారి ఏకంగా చికెన్ లోంచి..

Posted: 11/14/2017 11:00 AM IST
Melbourne man shocked to notice maggots in kfc chicken

కె.ఎఫ్.సీ (కెంటుకీ ఫ్రైయిడ్ చికెన్) మళ్లీ వార్తల్లోకి నిలిచింది. అమధ్య కెంటుకీలో ఎలుకల మాంసం పెడుతున్నారని ఒకసారి.. చికెన్ కాకుండా మరో పక్షి మాంసం వడ్డిస్తున్నారని మరోసారి.. ఇక్కడ కొన్న మాంసంతో పురుగులు వచ్చాయని ఇలా అనేక పర్యాయాలు ఇప్పటికే వార్తల్లో నిలిచిన కేఎఫ్ సి.. ఈ సారి మళ్లీ వార్తల్లో నిలించింది. అదెలా..? ఎక్కడ, ఏం జరిగింది..? అన్న వివరాల్లోకి వెళ్లే ముందు ఈ కథనం చదవండీ..

స్నేహితులందరూ ఓ చిన్న సెంటిమెంటల్ కార్యక్రమంలో భాగంగా కలుసుకున్నారు. ఇక వారంతా కలిసి పార్టీ చేసుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా అందరికీ చికెన్ బిర్యానీ అర్డర్ చేశారు. అయితే ఈ లోగా తమకు దగ్గర్లోని కెఎఫ్ సిలో చికెన్ పీస్ లను సరదాగా లాగిద్దామని మాన్నీ ఎస్టీనిస్లో(34) అనే వ్యక్తి వస్తూ వస్తూ.. అక్కడి నుంచి చికెన్ పీస్ లను పట్టుకోచ్చాడు. ఈ లోగా తన ఇంట్లో గుమ్మిగూడిన స్నేహితులకు ముందుగా కేఎఫ్ సీ చికెన్ పీస్ లను వడ్డించాడు.

అక్కడున్న వారందరిలోకి అత్యంత పిన్నవయస్సుడైన వ్యక్తి మాత్రం చికెన్ ను తినలేదు. కానీ చికెన్ తినాలా వద్దా అన్నట్లుగా తన ప్లేట్ లో వున్న చికెన్ పీస్ వైపు పరిశీలనంగా చూస్తున్నాడు. ఈ లోగా తన చుట్టూ వున్న స్నేహితులందరూ తమ చికెన్ పీస్ లను లాగించేశారు. అయితే అతని పరిశీలనలో మాత్రం ఓ విషయం వుంది. తన ముందున్న ప్లేట్ లోని చికెన్ పరిశీలిస్తే అందులోంచి ఓ పురుగు బయటకు వచ్చింది. చికెన్ పై అటుఇటు పాకుతోంది.

ఇది కుళ్లిన మాంసంలో ఉద్భవించే పురుగుగా వారు గుర్తించారు. దీంతో విషయాన్ని అక్కడున్న తన స్నేహితులందరికీ చెప్పాడు. ఇది కెఎస్ సీ నుంచి తీసుకోచ్చిన చికెన్ అని, అక్కడ నాణ్యతకు ప్రాథాన్యమిస్తారని భావించామని, అయితే ఇలా పురుగులు బయటపడం.. దానిని ఒక్కరు తప్ప అందరూ లాగించడంతో వారందరూ అందోళన చెందారు. వెంటనే కెఎఫ్‌సీ కంపెనీకి ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ రెస్టారెంటు వారు మాత్రం తమ వద్ద అలాంటివి జరగవని తాము ఎంతో క్వాలిటీ మెయిన్ టేన్ చేస్తామని చెప్పారు.



ఇక మరో అధికారి వచ్చి ఈ పురుగులు హానికారకం కాదని వాదించడం మొదలుపట్టాడు. తాము మాంసాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా తక్కువలో వుంచడం వల్లే ఇలా పురుగులు వచ్చాయంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఖంగుతిన్న యువకులు కేఎప్ సీకి యాజమాన్యానికి బుద్ది చెప్పాలని ఈ విషయాన్ని సొషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. అయితే ఆ తరువాత ఇదే అనుభవం మరో మహిళకు కూడా ఎదురైంది.

వారితోపాటు అదే కెఎప్ సీతో  భోజనాన్ని తెచ్చుకున్నా రో మహిళకు కూడా ఆ అనుభవం ఎదురైంది. అమె కూడా సోషల్ మీడియా వేదికగా కెంటుకీ ప్రైయిడ్ చికెన్ పై నిప్పులు చెరిగారు. కెఎఫ్ సీ నుంచి ఎవరూ ఎలాంటి అహారాం కొనుగోలు చేయకూడాదని, వారిచ్చిన చికెన్ లో కుళ్లిన మాంసం నుంచి ఉత్పన్నమయ్యే పురుగులు వున్నాయని అమె అరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇటు కంపెనీ ప్రతినిధులు మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చేసినా నెట్ జనులు మాత్రం తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ ఘటన అస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలోని రోక్స్‌బర్గ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ మెల్‌బోర్న్ లో జరిగిందని మాన్నీ తెలిపాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KFC  kentuky fried chicken  maggots  fried flesh  babu shower  Roxburgh Park  melbourne  australia  

Other Articles