Demonetisation has failed: Yashwant Sinha జయంత్ సిన్హా, జైషాలిద్దరిపై విచారణకు అదేశించండీ..

Probe my son but also amit shah s son jay shah yashwant sinha

Yashwant Sinha, jay shah, jayanth sinha, paradise papers, bjp, reservation, sc,st, Finance Minister Arun Jaitley, BJP, Yashwant Sinha, GST, tax

Former Union Minister Yashwant Sinha said that all politicians whose names crop up in the "Paradise Papers" -- including that of Jayant Sinha along with BJP chief Amit Shahs son Jay Shah.

జయంత్ సిన్హా, జైషాలిద్దరిపై విచారణకు అదేశించండీ..

Posted: 11/10/2017 08:20 PM IST
Probe my son but also amit shah s son jay shah yashwant sinha

కేంద్రంలోని నరేంద్రమోడీ స్రభుత్వం అవలంభిస్తున్న అర్థిక విధానాలపై తన అసంతృప్తిని వెల్లగక్కిన మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా.. తాజాగా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పాటు జీఎస్టీపై సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పించడంతో పాటు విపక్షాలకు చెందిన నేతలపై అధికారం మాటున వేధించడం కూడా సమంజసం కాదని హితుపు పలికిన ఆయనకు.. పెద్ద కష్టం వచ్చింది.

తాజాగా వెలుగుచూసిన ప్యారడైజ్ పేపర్ల కేసులో ఆయన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్ సిన్హా పేరు కూడా వుండటంతో అదికాస్తా చర్చనీయాంశంగా మారింది. దీంతో మరోమారు మీడియా ముందుకు వచ్చిన యశ్వంత్ సిన్హా.. తన స్పందనను తెలియజేశారు. నల్లధనానికి స్వర్గధామాలైన దేశాలకు అక్రమ మార్గాల్లో నిధులను తరలించారని అభియోగాలు ఎదుర్కోంటున్న తన కుమారుడితో పాటు ఈ జాబితాలో వున్న 741 మందిని కూడా విచారించాలని ఆయన అన్నారు.

నల్లధనాన్ని దేశం నుంచి తరలించి విదేశాల్లో దాచడం సముచితం కాదన్న ఆయన తన కుమారుడిపై తప్పకుండా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 15 రోజుల్లోగా వీరందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. అయితే అంతకుముందు పనామా పేపర్లు జాబితాలో వచ్చిన నల్లకుబేరులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక వీటికన్నా ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషాను కూడా విచారించాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయంటూ 'ది వైర్' అనే వెబ్ సైట్లో ఇటీవల కథనం వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles