Former Test cricketer Milkha Singh passes away మాజీ టెస్టు క్రికెటర్ గుండెపోటుతో మృతి

Former india batsman ag milkha singh dies aged 75

A G Milkha Singh. A gopal singh milkha singh, milkha sigh passed away, milkha singh no more, duleep trophy first centurian no more, AG Kripal Singh, Tamil Nadu, Cricket, Bishen Singh Bedi, Ranji Trophy, WV Raman, Abhishek Shekhawat, G Rajaraman

Former India cricketer A G Milkha Singh passed away on Friday following a cardiac arrest at a hospital here, family sources said. He was 75.

మాజీ టెస్టు క్రికెటర్ గుండెపోటుతో మృతి

Posted: 11/10/2017 02:00 PM IST
Former india batsman ag milkha singh dies aged 75

భారత మాజీ క్రికెటర్ ఏజీ మిల్కా సింగ్ అలియాస్ గొవింద్ సింగ్ మిల్కాసింగ్ (75) ఇవాళ కన్నుమూశారు. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మిల్కాసింగ్ కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. 1960 కాలంలో భారత్ తరపున ఆయన నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడారు. అదీకాక దేశవాలీ క్రికెట్ లో దులిప్ ట్రోఫీలో తొలిసారిగా శతకాన్ని నమోదు చేసింది కూడా మిల్కాసింగే కావడంతో గమనార్హం.

ఇక మిల్కాసింగ్ పోదరుడైన క్రిపాల్ సింగ్ కూడా దేశం తరపున 14 టెస్టు మ్యాచ్ లు ఆడారు. వీరిద్దరూ 1961-62 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ అయిన మిల్కా సింగ్ ఒక మంచి ఫీల్డర్ కూడా. తన 17వ ఏట రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మిల్కాసింగ్.. 18వ ఏట తొలి టెస్టు ఆడారు. మిల్కాసింగ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎనిమిది సెంచరీలతో నాలుగు వేలకు పైగా పరుగులు  సాధించారు. అప్పటి మద్రాసు(నేటి తమిళనాడు) రాష్ట్రం తరపున రంజీ మ్యాచ్ లు ఆడారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A G Milkha Singh  AG Kripal Singh  Tamil Nadu  Cricket  Bishen Singh Bedi  Ranji Trophy  WV Raman  

Other Articles