technical snag delays air india flight for hours బస్సుల్లోనే కాదు విమానాల్లోనూ అంతే.. ప్రయాణికులకు చుక్కలు..

Technical snag delays air india flight for hours passengers abundant

air india, delhi bound flight, visakhapatnam, technical snag, alternative flights, connectivity flight, international passengers, delayed by hours, hospitality

Air India a government run enterprise delhi bound flight delayed by hours together due to technical snag, but passengers were abundant by the staff.

బస్సుల్లోనే కాదు విమానాల్లోనూ అంతే.. ప్రయాణికులకు చుక్కలు..

Posted: 11/10/2017 11:33 AM IST
Technical snag delays air india flight for hours passengers abundant

ఓ వైపు కేంద్రప్రభుత్వం తమ అధికారులకు ఇకపై విమానంలో ప్రయాణించాల్సి వస్తే.. కేవలం ప్రభుత్వ విమానాయాన సంస్థ సేవలను మాత్రమే వినియోగించుకోవాలని అదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తమ ప్రయాణికుల పట్లు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన విమాన సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అసలు వారిని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు. అందుబాటులో వున్న ఒక్కరిద్దరు సిబ్బంది కూడా తమ విధుల సమాయం ముగిసిందని వెళ్లిపోగా.. ప్రయాణికులు మాత్రం నరకం చూశారు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖ  విమానాశ్రయంలో గురువారం ఉదయం 7.50 గంటలకు 180 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రన్ వే నుంచి కదులుతూ ఎగరడానికి సిద్ధమయ్యే సరికి సమస్యను పైలెట్ గుర్తించి విమానాన్ని తిరిగి అప్రాన్ పైకి తీసుకొచ్చేశారు. ప్రయాణికులందర్నీ దించేసి టెర్మినల్ బిల్డింగ్ లోకి పంపారు. మరో విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేసినా అది సాధ్యంకాదని సిబ్బంది తేల్చిచెప్పారు.

ఇక ఉదయం ఎనమిది గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన విమానం.. గంటల తరబడి అక్కడే వుండటంతో.. సుమారు పదహారు గంటలుగా టెర్మినల్ బిల్డింగ్లో ఉంచేయడంతో ప్రయాణికులు టిఫిన్లు, భోజనాలు లేక అల్లాడిపోయారు. తాను పొరుగుదేశానికి అత్యవసరంగా వెళ్లాలని విదేశీ ప్రయాణికురాలు వత్తిడి తెచ్చినా ఢిల్లీకి ఇంకో విమానంలో పంపలేమని, రీబుకింగ్ చేసుకోవాల్సిందేనని సెలవిచ్చారు. ఎయిరిండియా కూడా ప్రత్యామ్నాయం చూపక పోతే ఎలా అని ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.

కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను వెతుక్కుని గమ్యాలకు వెళ్లిపోయినా మిగతా ప్రయాణికులు మాత్రం పడిగాపులు పడ్డారు. రాత్రి తొమ్మిదిన్నరకు విమానం కదులుతుందని విమానవర్గాలు చెప్పినా రాత్రి పన్నెండయినా విమానం కదల్లేదు. పదకొండు గంటలకు అధికారులు కూడా ఇక్కడి నుంచి ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ విదేశీయులు, పిల్లలతో మరి కొందరు తల్లులు నానా యాతనపడిపోయారు. కనీసం భోజన సదుపాయాల్లేకుండా పట్టించుకోకుండా ఇలా హింస పెట్టడమేంటని ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. కనెక్టివిటీ ఫ్లెయిట్ మిస్ అవుతామని విదేశీ ప్రయాణిలు ఆందోళన చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles