hyderabad jeweller murdered in singapore సింగపూర్ లో హైదరాబాద్ నగల వ్యాపారి దారుణ హత్య

Hyderabad jeweller murdered in singapore

vasudev, jewellery shop, jewel business, kushaiguda, hyderabad, pakistan, pakistan youth, singapore, business, abduction, singapore indian embassy, murder, crime

A hyderabad kushaiguda jewellery businessmen vasudev had been murdered in singapore after been trapped by a pakistani person, who kidnapped him and demanded rs 5 cr ruppees.

సింగపూర్ లో హైదరాబాద్ నగల వ్యాపారి దారుణ హత్య

Posted: 11/10/2017 12:23 PM IST
Hyderabad jeweller murdered in singapore

సింగపూర్ లో దారుణం జరిగింది,. హైదరాబాద్ కుషాయిగూడుకు చెందిన ఓ నగల వ్యాపారిని ట్రాప్ చేసిన పాకిస్థానీ యువకుడు.. వ్యాపారం పేరుతో సింగపూర్ వచ్చేలా చేసి.. అతడ్ని అక్కడి హోటల్ గదిలో బంధించి.. అతని కుటుంబ సభ్యుల నుంచి ఐదు కోట్లు రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై వాసుదేవ్ కుటుంబసభ్యులు అలస్యంగా స్పందించడంతో ఏకంగా దారుణంగా హత్య చేసి పారిపోయాడు. దీంతో విదేశాల్లో వున్న భారతీయులు, విదేశాలకు వెళ్లే భారతీయులు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన నగల వ్యాపారి వాసుదేవ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో వుండగా, ఓ పాకిస్తానీ యువకుడితో పరిచమం ఏర్పడింది. ఇద్దరు తరచూ ఫేస్ బుక్ లో మీట్ అయ్యేవారు. దీంతో వాసుదేవ్ ను చాకచక్యంగా ట్రాప్ లోకి దింపిన పాకిస్థానీ.. అతడికి చక్కని వ్యాపారం అవకాశం కల్పిస్తానని చెప్పాడు. దీంతో ఎలా చేయాలన్న అన్న వివరాల తెలుసుకునేందుకు సింగపూర్ వస్తే.. తాను అక్కడికి వస్తున్నానని.. అక్కడ ఇద్దరం కలసి చర్చించుకోవచ్చునని చెప్పాడు.

పాకిస్తానీ యువకుడి మాటలను నమ్మిన వాసుదేవ్.. సింగపూర్ చేరకున్నాడు. అందుకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పాక్ యువకుడికి చేరవేశాడు. దీంతో వాసుదేవ్ ను ట్రాప్ చేసి.. ఓ హోటల్ గదిలో బంధించిన పాక్ యువకుడు.. అతడి కుటుంబసభ్యులకు వాట్సాప్ ద్వారా మేసేజ్ పెట్టి రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడు. అయితే అతని డీల్ పై అలస్యంగా స్పందించిన కుటుంబసభ్యులకు వాసుదేవ్ ఇక లేడన్న సమాచారం సింగపూర్ లోని భారత దౌత్యకార్యాలయం నుంచి అందింది. రేపు లేదా ఎల్లుండి అతని మృతదేహాన్ని నగరానికి తరలిస్తామని కూడా చెప్పారు. దీంతో వ్యాపారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vasudev  jewellery business  kushaiguda  hyderabad  pakistan  pakistan youth  singapore  business  abduction  murder  crime  

Other Articles