9 killed in Bathinda as truck ploughs through crowd పంజాబ్ బటిండాలో ఘోర రోడ్డు ప్రమాదం..

9 killed in bathinda as truck ploughs through crowd at accident site in smog

Road Accident In bahtinda, Accident Near bathinda, Accident in punjab, Dense fog, bathinda accident, Bathinda, Accident, Nine killed, Dense smog, Truck, Bridge, Bathinda-Rampura Phul road, Driver, bathinda smog, punjab smog, smog in punjab, smog accidents, punjab smog, latest news

Nine people were killed when a truck ploughed through a crowd that had gathered around an accident site at a bridge on the Bathinda-Rampura Phul road in the wee hours

ITEMVIDEOS: పంజాబ్ బటిండాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Posted: 11/08/2017 06:51 PM IST
9 killed in bathinda as truck ploughs through crowd at accident site in smog

పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ లోని భ‌టిండా జిల్లా బుచోమండి-రాంపుర ఫూల్ రోడ్డులో ఇవాళ తెల్లవారు జామున ఓ ప్రమాద ఘటన వద్ద నిల్చుని చూస్తున్న జనంలోకి ఓ లిక్విడ్ సిమెంట్ లారీ వేగంగా వచ్చి ఢీకొనింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడిక్కడే మరణించారు. కాగా మరికొందరు తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను అస్పత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాధానికి కూడా కేవలం దట్టంగా అలుముకున్న పోగమంచే కారణమని భావిస్తున్నారు.

బుచోమండీ-రాంపూర్ పూలే రోడ్డు మార్గంలోని ఓ బ్రిడ్జిపై ఓ కారు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. దీంతో ఆ కారును గమనించని ఓ ప్రైవేటు బస్సు వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొనింది. దీంతో ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. కారు-బస్సు డ్రైవర్ల మధ్య వాదన నడుస్తున్న క్రమంలో అదే రోడ్డుపై వస్తున్న లిక్విడ్ సిమెంట్ ట్యాంకర్ లారీ వేగంగా దూసుకువచ్చి.. ప్రమాదం వద్ద నిల్చున్న జనంపై నుంచి వెళ్లడం.. తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని క్షతగాత్రులను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని చెప్పారు. అయతే ఈ ప్రమాదాలకు కారణం దట్టంగా అలుముకున్న పోగమంచేనని పోలీసులు అంచనాకు వచ్చారు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో అంత వేగంగా వాహనాలు కూడా నడపరాదని సూచిస్తున్నారు. సిమెంటు లారీ డ్రైవర్ తో పాటు ప్రైవేటు బస్సుపై కూడా కేసు నమోదు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bathinda  Accident  Nine killed  Dense smog  Truck  Bridge  Bathinda-Rampura Phul road  crime  

Other Articles