High Court Gives Green Signal for Kaleshwaram Project | కేసీఆర్ కలల ప్రాజెక్టుకు.. కోర్టు లైన్ క్లియర్... కండిషన్స్ అప్లై

Hc line clear for kaleswaram project

Kaleshwaram Project, Telangana Government, High Court of Judicature Hyderabad, KCR Kaleshwaram Project, Kaleshwaram Project Works, Kaleshwaram Project Issue, Kaleshwaram Project Green Tribunal stay, Harishrao Kaleshwaram Project

High Court Gives Green Signal for Kaleshwaram Project Works. But, Put Conditions for Not Destroying Forest Area.

కాళేశ్వరం ప్రాజెక్టు.. టీ ప్రభుత్వానికి లైన్ క్లియర్

Posted: 11/08/2017 12:36 PM IST
Hc line clear for kaleswaram project

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వంకు ఊరట లభించింది. టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టుకునేందుకు అనుమతి జారీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే... రిజర్వ్‌ఫారెస్ట్‌ ప్రాంతాల్లో మాత్రం పనులు చేయవద్దని హైకోర్టు సూచించింది.

గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ స్టే విధించిన విషయం తెలిసిందే. తాగు నీటి అవసరం కోసమే ప్రాజెక్టును నిర్మించాలని, అడవులను ధ్వంసం చేయటానికి వీల్లేదని కోర్టు పేర్కొంది. పిటిషనర్ కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తిరిగి సంప్రదించుకోవచ్చని సూచించింది. తాజాగా భూ సేకరణకు పరిహారంగా నిధుల జమకు ప్రభుత్వ అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. 3,168 హెక్టార్ల అటవీభూమి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

ప్రాజెక్టు వివాదం...

ప్రాణహిత నదిపై అదిలాబాద్ తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోనే  ప్రతిపాదించారు. ఆ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలుత అభ్యంతరాలు వ్యక్తం కావటంతో పనులు నిదానించాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం హయాంలో హరీశ్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన అనంతరం... ముంపు లేకుండా చూడాలని, 160 టీఎంసీల నీటిని తరలించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఫఢ్నవిస్‌ తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రభావాన్ని తగ్గించి, సీడబ్ల్యూసీ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేయాలని నిర్ణయించింది.

నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూ పలు ప్రత్యామ్నాయాలను పరిశీలించింది. గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద నీరు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించింది. ఇక్కడ బ్యారేజీలను నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు ప్రాంతాన్ని తగ్గించవచ్చన్న ఆలోచనకు వచ్చింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి బోర్డు లెవనెత్తుతున్న అభ్యంతరాలకు వివరణలు ఇస్తూ వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles