Demonetisation reality dawns after a year | నోట్ల రద్దుకు ఏడాది.. ఏం జ(ఒ)రిగింది?

Demonetisation completed one year

Demonetisation Anniversary, Black Day, Rahul Gandhi, Congress Protest, DeMon, Demonetisation One Year Report

Demonetisation Anniversary. 125 Crore Won A Decisive Battle, Says PM Modi; Rahul Hits Back.

నోట్ల రద్దుకు ఏడాది.. ఏం జరిగింది?

Posted: 11/08/2017 12:03 PM IST
Demonetisation completed one year

బ్లాక్ డే.. యాంటీ బ్లాక్ డే... పోటాపోటీగా దేశం మొత్తం ఇప్పుడు యూపీఏ, ఎన్టీఏలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. గత సంవత్సరం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దును ప్రకటించిన తరువాత ప్రజలు ఎదుర్కున్న ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ నాశనం కావటం వంటి అంశాలతో కాంగ్ దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం క్యాష్ లెస్ లాభాలు, పురోగతి అంటూ ఉపన్యాసాలు ఇస్తోంది. వీటిలో ఏ వాదనకు మద్దతు పలకటం మాట అటుంచి అసలు నోట్ల రద్దు ద్వారా ఏం జరిగిందో ఓసారి బేరీజు వేసుకుందాం.

బ్యాంకుల్లో జమ అయిన మొత్తం కరెన్సీలో 33 శాతం డబ్బు కేవలం 0.00011 శాతం మంది నుంచి మాత్రమే వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని నల్లధనాన్ని వెలికితీసేందుకు జరిగిన అతిపెద్ద ప్రయత్నం ఇదని చెబుతూ, మోదీ ప్రభుత్వం నేడు వివిధ దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనను ఇచ్చింది.నోట్ల రద్దు తరువాత వచ్చిన లాభాలను ఈ ప్రకటన ఉటంకించింది. ఉగ్రవాద వ్యతిరేకత నుంచి ఉద్యోగ సృష్టి వరకూ ఈ నోట్ల రద్దు పాజిటివ్ ప్రభావాన్ని చూపించిందని, ఈ ప్రకటనలో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. కశ్మీర్ లో 75 శాతం రాళ్లదాడి ఘటనలు తగ్గిపోయాయని, వామపక్ష తీవ్రవాదం 20 శాతం తగ్గిందని పేర్కొంది.

2.24 లక్షల షెల్ కంపెనీలను గుర్తించామని, 35 వేలకు పైగా కంపెనీలు 58 వేల బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 17 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించామని వెల్లడించింది. ప్రజలు సహకరించబట్టే ఇదంతా జరిగిందని పేర్కొంది. మొత్తానికి భారత ఆర్థిక వ్యవస్థను శుభ్రపరిచామని వెల్లడించింది.

మోదీ వరుస ట్వీట్లు...

నోట్ల రద్దుతో దీర్ఘకాలిక లక్ష్యాలుంటాయంటూ మొదటి నుంచి వాదిస్తున్న మోదీ సర్కార్ ఈవాళ దాని ప్రాధాన్యత తెలియజేసేందుకు రంగంలోకి దిగింది. ఉదయం నుంచే మోదీ తన ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేయటం ప్రారంభించారు. ఈ యేడాది కాలంలో ఈ నిర్ణయం ద్వారా సాధించిన పురోగతి అంటూ ఓ వీడియోను విడుదల చేసిన మోదీ.. దాని గురించి ఓ వీడియోను పోస్ట్ చేసి ఫీడ్ బ్యాక్ కూడా కోరారు. మరోవైపు పార్టీ శ్రేణులు కూడా దేశవ్యాప్తంగా చర్చ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

రాహుల్, విపక్షాల విమర్శలు...

ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా రాహిత్యంతో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా పేద భారతీయుల జీవితాలు ధ్వంసమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. స్వతంత్ర భారతావనిలో నోట్ల రద్దు ఓ విషాదకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నోట్ల రద్దు తరువాత పేదలు ఎన్నో ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

 

బీజేపీ ఏం ఘనకార్యం చేసిందని వేడుకలు జరుపుకుంటోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. నోట్ల రద్దు భారతజాతిని మోసం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యానించగా, ఇదో అతిపెద్ద స్కామ్ అని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇది నల్లధనంపై పోరాటం కాదని, తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు అధికారపక్షం ఆడిన నాటకమని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సైతం నోట్ల రద్దుతో దేశానికి ఒరిగిందేం లేదని చెప్పటం గమనార్హం.

అవినీతి అధికారుల అరెస్ట్

నోట్ల రద్దు తర్వాత ఇప్పటిదాకా 180 మంది అధికారులను కేంద్రం విచారణ సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. 77 కేసులు నమోదు కాగా.. వీరిలో చాలా మట్టుకు నోట్ల మార్పిండికి సహకరించినవారే కావటం విశేషం.ఏది ఏమైనా క్యాష్ లెష్ ఆలోచన ఏ మేర విజయం సాధించిందన్న అంశం పక్కన పెడితే.. ప్రజలకు ఇంకా నగదు అన్నది పూర్తి స్థాయిలో అందుబాటులో లేదన్న విషయం మాత్రం వాస్తవమని స్వయంగా ఆర్బీఐ ప్రకటించటం విశేషం. ఏది ఏమైనా ఈ గందరగోళం నడుమ రాజుగా మిగిలింది మాత్రం చిన్న నోటే అన్న విషయం ఒప్పకుని తీరాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles