narayana college illegal affairs audio tape leaked అ కాలేజీ భాగోతాలను భయటపెట్టిన అడియో టేప్..

Alleged leaked tape of narayana college reveals illegal activities

narayana college, narayana college black to white, narayana college illegal affairs, narayana college students torture, narayana college leaked tape, naveen goud, anitha agarwal, illegal affairs, uppal police station,

alleged leaked tape of narayana college prinicipal nitha agarwal and vice principal naveen goud reveals illegal activities in the college.

ITEMVIDEOS: అ కాలేజీ బాగోతాలను భయటపెట్టిన అడియో టేప్..

Posted: 11/03/2017 09:21 AM IST
Alleged leaked tape of narayana college reveals illegal activities

విద్యార్థుల ఆత్మహత్యలతో వివాదాస్పందగా మారి నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న నారాయణ కాలేజీలకు సంబంధించిన మరో అడియో టేప్ లీక్ కావడంతో.. కాలేజీ మాటున జరుగుతున్న అనైతిక కార్యకలాపాల భాగోతం కూడా బయటపడింది. ఈ అడియో అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలోనూ హల్ చల్ చేస్తుండటంతో.. ఈ అడియో టేప్ విడుదలకు ముఖ్యకారకుడిగా భావిస్తున్న నవీన్ గౌడ్ పై నారాయాణ కాలేజ్ సిబ్బంది దాడికి కూడా పాల్పడ్డారు. బాధితుడు తనకు ప్రాణభయం వుందంటూ ఏకంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసును కూడా నమోదు చేశాడంటే.. పరిస్థితి ఏంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

కాలేజీ మాటన జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, లెక్చరర్లతో సాగిస్తున్న అక్రమ సంబంధాల నుంచి మొదలుకుని నోట్ల రద్దు సమయంలో డబ్బును ఎలా మార్చిన వైనం కూడా వీరి అడియో సంబాషణలో బయటపడింది. అక్రమసంబంధం ఇష్టంలేక ఓ లెక్చరర్ అత్మహత్యకు పాల్పడిన ఘటన, అమె పోస్టుమార్టం నివేదికను కూడా తారుమారు చేసిన వైనం గురించి కూడా వీరి మధ్య సంబాషణల్లో బయటకు పోక్కింది. రామాంతపూర్ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపాల్ నవీన్, అదే కాలేజీ ఉద్యోగిని సరితా అగర్వాల్ మధ్య జరిగినట్టు చెబుతున్న సెల్ ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నోట్ల రద్దు సమయంలో బ్లాక్ మనీని వైట్ గా ఎలా మార్చుకున్నారన్న విషయంతో పాటు, నారాయణ యాజమాన్యంలో కీలకవ్యక్తిగా ఉన్న ఒకతను చేస్తున్న అరాచకాలు, ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలు వినిపిస్తున్నాయి. అతనికి ఊరిలో ఈమూ పెంపకం కేంద్రం, సువిశాల ఫామ్ హౌస్, పొలాలు, జూబ్లీహిల్స్ లో బంగళా, హబ్సీగూడలో పెద్ద అపార్ట్ మెంట్స్ భవనం, సర్వే ఆఫ్ ఇండియాలో ఖాళీ స్థలం తదితరాలు ఉన్నట్టు సరిత చెబుతున్నారు. ఆపై టీచర్లతో సంబంధాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు.

శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటన్న విషయం కూడా ఫోన్ లో వినిపించింది. ఇక హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురంలో ఉన్న నారాయణ గెస్ట్ హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని ఫోన్ లో వినిపిస్తోంది. నోట్ల రద్దు జరిగినప్పుడు తాను స్వయంగా రూ. 5 లక్షలు మార్చానని, తన వద్ద ఉన్న కరెన్సీ మార్చలేక గిలగిలా కొట్టుకున్నాడని జోకులేసుకున్నారు. ఈ సంభాషణ ఇప్పుడు పలు సామాజిక మాధ్యమ వెబ్ సైట్లలోకి ఎక్కి వైరల్ అయింది.  వారి సంభాషణను మీరూ వినవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles