high court squashes petitions on TRT డీఎస్సీ నోటిఫికేషన్ కు లైన్ క్లియర్

High court squashes petitions on trt

high court, andhra pradesh, telangana, Teacher Recruitment Test, petitions on TRT, new districts, old districts, government's favour, TRS, KCR, Congress

The high court squashes petitions on Teacher Recruitment Test, clears lines in favour of government

టీఆర్టీ పరీక్షలకు, డీఎస్సీ నోటిఫికేషన్ కు లైన్ క్లియర్

Posted: 11/02/2017 05:14 PM IST
High court squashes petitions on trt

తెలంగాణ ఉపాధ్యాయ అశావహులు గత కొన్నేళ్లుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు ఎట్టకులకు లైన్ క్లియర్ అయ్యింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ అందుకోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ నుంచి నియామకాలు చేపట్టేందుకు గాను టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ లను కూడి నిర్వహించేందుకు కూడా తేదీలను ప్రకటించింది. అయితే ఈ విషయంలో కొంత వ్యతిరేక భావం వున్న పలువురు హైకోర్టులో డీఎస్సీ నోటిఫికేషన్ పై పిటీషన్లు వేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పూర్తిగా కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని వేసిందని, ఇలా చేయడం సమంజసం కాదని న్యాయస్థానాన్ని అశ్రయించారు. అయితే ఇలా డీఎస్సీ నోటిఫికేషన్ కు, టీఆర్టీ పరీక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై విచారణ చేసిన న్యాయస్థానం వాటన్నింటినీ తోసిపుచ్చింది. గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

అన్ని అంశాలను పిరశీలించిన తరువాతనే.. తాము నూతన జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రభుత్వ తరుపు వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో గత కొన్నేళ్లుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అల్ ది బెస్ట్ చెబుదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  Teacher Recruitment Test  petitions on TRT  new districts  TRS  KCR  Congress  telangana  

Other Articles