Right before Release, one more shock for Rajasekhar గరుడ వేగ రిలీజ్ కు ముందు హీరో ఇంట మరో విషాదం

Right before release one more shock for rajasekhar

garuda vega, hero Rajashekar, jeevitha, jeevitha rajashekar, murali srinivas, rajashekar mother, tragedy, tollywood

Recently After his mother's death hero Rajasekhar has been struggling to come out of the tragedy. Now, during the early hours of today, Jeevitha’s brother Murali who has been battling for life passed away due to ill health.

గరుడ వేగ రిలీజ్ కు ముందు హీరో ఇంట మరో విషాదం

Posted: 11/02/2017 10:34 AM IST
Right before release one more shock for rajasekhar

మరో 24 గంటల వ్యవధిలో తనకు కెరీర్ లే అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న గరుడ వేగ చిత్రం విడుదల కాబోతున్న క్రమంలో హీరో రాజశేఖర్ కు మరో షాక్ తగిలింది. తన భార్య జీవిత సోదరుడైన మురళి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం మరణించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఓ అసుపత్రిలో చికిత్స పోందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

గరుడ వేగ చిత్రం రాజశేఖర్ కెరీర్ ను మలుపుతిప్పనుందన్న క్రమంలో.. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న పోస్టు ప్రోడక్షన్ సన్నాహాలలో వుండగా, హీరో రాజశేఖర్ తల్లి మరణించారు. ఆ దు:ఖాన్ని దిగమింగుకుని రాజశేఖర్ చిత్ర విడుదల సన్నాహాల్లో వుండగా, సరిగ్గా విడుదలకు ఒక్కరోజు ముందు ఆయన బావమరిది మురళి శ్రీనివాస్ కన్నుమూశారు. దీంతో హీరో రాజశేఖర్ ఇంట్లో మరో విషాదం అలుముకుంది. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు మురళీ శ్రీనివాస్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, రాజశేఖర్ నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీమియర్ షోను చూడటానికి రావాల్సిందిగా హీరో రాజశేఖర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి అహ్వానించిన విషయం పాఠకులకు తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles