mla demands rs. 1 crore alleges businessman రూ.కోటి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే.. కేసు నమోదు

Mla demands rs 1 crore alleges businessman case filed

Businessman house demolished, ruling party mla demands rs 1 cr, mla demands builder bride, crime, mylardevpally police, Ruling party leader MLA, Rajendra nagar mla, T.Prakash goud, Rs. 1 crore, fir filed

Businessman approches mylardevpally police alleging that Ruling party leader and Rajendra nagar mla T.Prakash goud demands him to pay Rs. 1 crore and demolished his house.

రూ.కోటి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే.. కేసు నమోదు

Posted: 11/01/2017 01:28 PM IST
Mla demands rs 1 crore alleges businessman case filed

అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ పై మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సహా అతని అనుచరులు తనను కోటి రూపాయల మేర డిమాండ్ చేశారని, వాటిని ఇవ్వనని తేల్చిచెప్పినందుకు గాను తన ఇంటిపై దౌర్జన్యం చేశారని.. ఇంటి ప్రహారీ గోడను కూడా కూల్చివేశారని, తనను కూడా చంపేస్తామని బెదిరింపులు జారీ చేశారని జి. మోహన్‌రెడ్డి అనే వ్యాపారవేత్త పోలీసులను అశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై ఆక్రమణ, క్రిమినల్ కేసును నమోదు చేసిన విచారణ జరుపుతున్నారు.

ఈ క్రమంలో ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, మోహన్‌రెడ్డి అనే వ్యాపార వేత్త ప్రస్తుతం కలిగి ఉన్న భూమి ఒకప్పుడు నడకదారని.. అయితే దానిని అక్రమించి ఆయన ప్రహరీ గొడను కడుతున్నారని ఈ క్రమంలో దానిని తిరిగి వినయోగంలోకి తీసుకురావాల్సిందిగా ప్రజలు కోరిన నేపథ్యంలో తాను మోహన్ రెడ్డికి విషయాన్ని చెప్పానన్నారు. అయినా నిర్లక్ష్యం వహించడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సమక్షంలోనే ప్రహరీని కూల్చివేసినట్టు ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.

కాగా, ఎమ్మెల్యే, అతని అనుచరులు తన భూమిలోకి చొరబడడమే కాకుండా అక్కడి గార్డులను బెదిరించారని, జేసేబీతో గోడను కూల్చివేశారని మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు ఉపయోగించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలున్నా ఓ ప్రత్యేక ఎజెండాతోనే తనను బెదిరించారని మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రహరీని కూల్చేస్తున్నప్పుడు పోలీసులు కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ లేరని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles