SC quashes Mamata govt plea challenging Aadhaar మమత సర్కారుకు షాక్.. పిటీషన్ తోసిపుచ్చిన సుప్రీం

Top court pulls up wb government for plea against aadhar mobile linking

supreme court, mamata banerjee government, aadhaar act, state challenges centre, Chief Minister, Linking Aadhaar, Aadhaar card, Supreme Court, Aadhaar plea, West Bengal, politics

The Supreme Court came down hard on the Mamata Banerjee government for filing a plea challenging the Centre's move to make Aadhaar mandatory for availing benefits of social welfare schemes, saying it was against the federal structure.

మమత సర్కారుకు షాక్.. పిటీషన్ తోసిపుచ్చిన సుప్రీం

Posted: 10/30/2017 02:54 PM IST
Top court pulls up wb government for plea against aadhar mobile linking

కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశసర్వోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్రాలు ఎలా సవాల్ చేస్తాయంటూ, పార్లమెంటు నిర్ణయాన్ని సవాలు చేయడం ఎలా సమంజసమని చీవాట్లు పెట్టింది. అయితే ఆమె దాఖలు చేసిన పిటిషన్ కొన్ని భాగాలను విచారణకు స్వీకరించేందుకు అంగీకరించిన న్యాయస్థానం.. రాష్ట్రం తరపున కాకుండా వ్యక్తిగతంగా తన పిటీషన్ ను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని సూచించింది.

సెల్ ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ లను ఆధార్ కార్డు నెంబరుతో ఎందుకు అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన కపిల్ సిబాల్.. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం ఆధార్ కార్డు అనుసంధానం కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తుది గడువును విధించడంపై నెలరోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

వినియోగదారులకు ఆధార్ కార్డు ధ్రువీకరణ తప్పనిసరి అంటూ టెలీకం సంస్థలు చెబుతున్నాయి. ముందు ముందు ఆధార్ కార్డు లేనిదే ఫోన్ కనెక్షన్లు ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తున్నాయి. సరిగ్గా ఈ అంశంపైనే ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయ స్థానం ముందు వాదనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం మమత శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను తప్పనిసరి చేయడమంటే.. వారి గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని ఆమె వాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles