Sushma Swaraj helps Indian family stuck in Malaysia తెలంగాణ చిన్నమ్మ.. భారతీయు పాలిట పెద్దమ్మ

Sushma swaraj helps indian family in malaysia who lost passports

Sushma Swaraj, Indian embassy Malaysia, External affairs minister, Sushma Swaraj Twitter, Twitter, Indians abroad

External affairs minister is Sushma Swaraj has frequently earned praise for helping Indians abroad who reach out to her through Twitter.

తెలంగాణ చిన్నమ్మ.. భారతీయు పాలిట పెద్దమ్మ

Posted: 10/28/2017 04:26 PM IST
Sushma swaraj helps indian family in malaysia who lost passports

అపదో వున్నవారికి అభయహస్తాన్ని అందించేకేంద్ర మంత్రులలో సుష్మాస్వరాజ్ తరువాతే ఎవరైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే భారతీయులకు భారతమాత తరువాత ఆ స్థానంలో నిలిచేలా తన సహాయక చర్యలతో చేసుకుంది సుష్మాస్వరాజ్. ఓ వైపు అమె అనారోగ్యంతో అసుపత్రిలో వున్నా.. తన శాఖకు సంబంధించిన పనులను మాత్రం సవ్యంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఆర్తులకు సకాలంలో ఆపన్న హస్తం అందించి తానేంటో మరోసారు నిరూపించుకున్నారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్.
 
కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న ఓ భారతీయ కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చేశారు. ‘‘సుష్మా స్వరాజ్ గారూ! మా కుటుంబం మలేసియా విమానాశ్రయంలో ఉంది. వాళ్ళ పాస్‌పోర్టులు పోయాయి. వారాంతం కావడంతో భారతీయ దౌత్య కార్యాలయం మూసివేసి ఉంది. దయచేసి సహాయపడండి’’ అని మీరా రమేశ్ పటేల్ ఓ ట్వీట్‌లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు.
 
దీనిపై సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు. ‘‘మలేసియాలోని ఇండియన్ ఎంబసీ : ఇది ఎమర్జెన్సీ కేసు. దయచేసి ఎంబసీని తెరిచి, భారతీయ కుటుంబానికి సహాయపడండి’’ అని ట్వీట్ చేశారు. దీంతో మలేసియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రతిస్పందించి, ఆ కుటుంబంతో మాట్లాడామని, సమస్యను పరిష్కరిస్తున్నామని ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ అమెరికాలో చదువుతున్న విద్యార్థిని అనూష ధూళిపాళకు కూడా సహాయపడ్డారు. అనూష ఓ ట్వీట్‌లో తన పాస్‌పోర్టు పోయిందని, సహాయపడాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles