Burglars loot Rs 1 Cr from MLA kin’s home ఎమ్మెల్యే సోదరుడి ఇంట్లో చోరి.. రూ. కోటి అపహరణ

Burglars loot rs 1 cr from mla kin s home

mla amanchi krishna mohan, amanchi sri hari, Robbery, chirala mla, prakasham, vetapalem, pandillapalli, Chirala DSP Prem Kajal, house breaking, Bhusarapu Satya Yesubabu, 250 sovereigns gold, 25 kgs silver articles, Rs 16 lakhs cash, crime

The thieves decamped with the booty of around Rs. 1 crore looted from the house of Amanchi Seethaiah on the night of Thursday. Seethaiah is the brother of MLA from Chirala, Amanchi Krishnamohan

ఎమ్మెల్యే సోదరుడి ఇంట్లో చోరి.. రూ. కోటి అపహరణ

Posted: 10/28/2017 01:07 PM IST
Burglars loot rs 1 cr from mla kin s home

దొంగలు కూడా సామాన్యుల ఇళ్లను టార్గెట్ చేయకుండా ఏకంగా సంఘంలో పరపతి వున్న పెద్దల ఇళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. కొంతకాలం కింద తెలంగాణలో ఎంపీ ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు.. తాజాగా నవ్యాంద్ర ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీహరి అలియాస్ సీతయ్య నివాసంలో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని శ్రీహరి నివాసం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు సుమారు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి అభరణాలతో పాటు నగదును చోరీ చేశారు.

అనారోగ్యంతో ఉన్న శ్రీహరి కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులక్రితం హైదరాబాద్‌ స్టార్‌ ఆసుపత్రికి వెళ్లిన ఆయన అక్కడే వున్నారు. అయితే పందిళ్లపల్లిలోని తన ఇంటి వద్ద  కాపలా ఉంటున్న వాచ్ మన్ రాత్రి రాకపోవడం గమనించిన దొంగలు ఇంటి వెనుకవైపు నుంచి గోడదూకి లోనికి ప్రవేశించారు. తలుపు గడియ పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు.. ఇంటిలోని అనువనువూ వెతుకుతూ ఎక్కడ విలువైన అభరణాలు కనిపించినా సేకరించి తాపీగా పని ముగించుకుని అబరణాలు, డబ్బులు తీసుకుని పరారయ్యారు.

మరుసటి రోజు ఉదయం పనిమనిషి తలుపులు తెరచి, గడియ విరిగి ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని సీతయ్య బావ మరిది లక్ష్మీనారాయణకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్ ఆద్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ లతో ఆధారాల కోసం వెతికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles