దొంగలు కూడా సామాన్యుల ఇళ్లను టార్గెట్ చేయకుండా ఏకంగా సంఘంలో పరపతి వున్న పెద్దల ఇళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. కొంతకాలం కింద తెలంగాణలో ఎంపీ ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు.. తాజాగా నవ్యాంద్ర ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీహరి అలియాస్ సీతయ్య నివాసంలో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని శ్రీహరి నివాసం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు సుమారు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి అభరణాలతో పాటు నగదును చోరీ చేశారు.
అనారోగ్యంతో ఉన్న శ్రీహరి కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులక్రితం హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన అక్కడే వున్నారు. అయితే పందిళ్లపల్లిలోని తన ఇంటి వద్ద కాపలా ఉంటున్న వాచ్ మన్ రాత్రి రాకపోవడం గమనించిన దొంగలు ఇంటి వెనుకవైపు నుంచి గోడదూకి లోనికి ప్రవేశించారు. తలుపు గడియ పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు.. ఇంటిలోని అనువనువూ వెతుకుతూ ఎక్కడ విలువైన అభరణాలు కనిపించినా సేకరించి తాపీగా పని ముగించుకుని అబరణాలు, డబ్బులు తీసుకుని పరారయ్యారు.
మరుసటి రోజు ఉదయం పనిమనిషి తలుపులు తెరచి, గడియ విరిగి ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని సీతయ్య బావ మరిది లక్ష్మీనారాయణకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్ ఆద్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ లతో ఆధారాల కోసం వెతికారు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని బీజేపి.. కేరళ రాష్ట్రంలో మాత్రం తమ ఉనికిని చాటుకునేందుకు కసరత్తును తీవ్రం చేసింది.... Read more
Mar 04 | ఈ చిన్నారి మృత్యుంజయురాలే. ఎందుకలా అంటున్నారంటే.. ఈ చిన్నారి ఏకంగా 12 వ అంతస్తు నుంచి కింద పడినా.. స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. ఔనా.? అదెలా అంటే.. అమెను ముందుగానే గమనించిన ఓ... Read more
Mar 04 | ప్రపంచంలో ఆరవ వింతగా నిలిచిన పాలరాతి శిల్ప నిర్మాణం తాజ్ మహల్ లో బాంబు పెట్టానని ఓ అగంతకుడు చేసిన ఫోన్ కాల్ తో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. అణువణువూ గాలించిన తరువాత... Read more
Mar 04 | కర్ణాటకకు చెందిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపడంతో మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. సదరు రాసలీలల మంత్రివర్యుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విపక్షాలతో పాటు... Read more
Mar 03 | ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం వినిపించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది.... Read more