Chandrababu Naidu nod to Amaravati New Designs | మొత్తానికి చంద్రబాబు హ్యాపీ.. పనులు మొదలుపెట్టడమే...

Chandrababu happy with amaravati designs

Andhra Pradesh, CM N Chandrababu Naidu, Chandrababu Naidu Amaravati, Amaravati New Designs, Andhra Pradesh Capital Designs, Chandrababu Happy with New Designs

Andhra Pradesh CM N Chandrababu Naidu nod to Amaravati New Designs. Small Changes Suggested by Babu Amaravati Capital Work

మొత్తానికి చంద్రబాబు హ్యాపీ!

Posted: 10/26/2017 09:20 AM IST
Chandrababu happy with amaravati designs

అమరావతి కొత్త డిజైన్లకు మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో ఆర్కిటెక్టులు సమర్పించిన ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ఆయన పెదవి విరిచారంటూ.. ఆ క్రమంలోనే మరోసారి నిపుణులతో సమావేశమయ్యారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే హైకోర్టు, శాసనసభ భవంతుల ఆకృతులలో చిన్నచిన్న మార్పులు సూచించిన చంద్రబాబు వీలైనంత వేగంగా నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పినట్లు తెలుస్తోంది. సచివాలయాన్ని మొత్తం ఐదు టవర్లుగా నిర్మించనున్నారు. ఇందులో మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 టవర్లు ఉంటాయి. వీటికి కొంచెం దూరంగా సీఎం, ముఖ్యమంత్రి కార్యదర్శుల కార్య స్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం తదితర వాటితో మరో టవర్ ఉంటుంది.

పరిశీలన దాదాపు పూర్తికావడంతో ఇక పనులను వేగిరం చేసేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అమరావతి ఆకృతుల విషయంలో స్పష్టత రావటంతో అధికార వర్గాలు సైతం ఊపిరి పీల్చుకుంటున్నాయి.

 

ఇది కూడా చదవండి... అమరావతి కొత్త డిజైన్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles