Hyderbad Man posts Woman facebook Photos in Adult Site | యువతికి పెళ్లి టార్చర్.. ఫేస్ బుక్ ఫోటోలు అడల్ట్ సైట్లో పెట్టాడు

Hyderabad youth held for torture girl

Hyderabad, Hyderabad Man Held, Man Torture Woman, Woman Facebook Photos in Adult Site, Blackmail, Adult Site Blackmail, Hyderabad Girl Harass

Hyderbad Man posts Woman facebook Photos in Adult Site While she Not accept Yousuf's Marriage Proposal, He posts Her Facebook Photos and Phone Number in Adult Site.

అశ్లీల సైట్లో యువతి ఫోటోలు.. యువకుడి అరెస్ట్

Posted: 10/26/2017 09:45 AM IST
Hyderabad youth held for torture girl

హైదరాబాద్ లో మరో ప్రేమన్మాది వికృత చేష్టలు వెలుగుచూశాయి. ప్రేమించానని కొంత కాలం వెంటపడిన ఓ యువకుడు.. చివరకు ఆమె ఫోటోలను అశ్లీల సైట్ లలో అప్ లోడ్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. చివరకు అతన్ని పథకం ప్రకారం పట్టుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

జహనుమా గుల్జార్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్ (24) ఆరు నెలలుగా తన ఇంటి వద్ద ఉండే యువతి(22) వెంట పడుతున్నాడు. మొన్నీమధ్యే ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడంట. అయితే అందుకు ఆమె నిరాకరిచటంతో పగ పెంచుకున్న ఉన్మాద చర్యకు దిగాడు. ఆ యువతి ఫేస్‌బుక్ ఖాతాలోని ఫొటోలను తీసుకుని.. ఆమె పోన్ నంబరుతో సహా అశ్లీల వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేశాడు. ఇక అక్కడి నుంచే అసలు తంతు మొదలైంది.

ఆమెకు వరుసపెట్టి ఫోన్లు రావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు. ఈ వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఇలాంటి వేధింపులు ఎదురయినప్పుడు షీ టీంకు గానీ.. లేదా కంట్రోల్ రూంకు గానీ సమాచారం అందించాలని ఆయన మహిళలకు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles