fake stamp paper scam kingpin Abdul Kareem Telgi serious అసుపత్రిలో అబ్దుల్ కరీం తెల్గీ.. పరిస్థితి విషమం..

Fake stamp paper scam kingpin abdul kareem telgi serious

fake stamp paper scam, Accused of fake stamp paper scam, Abdul Kareem telgi, abdul kareem telgi, accused, kingpin, fake stamp papers, convicted, admited, health, hospital, banglore, karnataka, crime

Accused of fake stamp paper scam Abdul Kareem Telgi admitted in Hospital as he is said to be serious

అసుపత్రిలో అబ్దుల్ కరీం తెల్గీ.. పరిస్థితి విషమం..

Posted: 10/24/2017 11:59 AM IST
Fake stamp paper scam kingpin abdul kareem telgi serious

నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా వున్న అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం విషమించింది. ఆయన పరిస్థితి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు వుందని సమాచారం. ఆయన జీవించే వున్నా.. వెంటిలేటర్ సాయంతోనే శ్వాస తీసుకుంటున్నారని, ఆయన అరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారడానికి కారణం మాత్రం జైలు అధికరులేనని కరీం తరపు న్యాయవాది ఎంటీ నన్నయ్య అన్నారు. సుదీర్ఘ అనారోగ్యంతో కరీం బాధపడుతుండగా.. పరిస్థితి విషమించటంతో నాలుగు రోజుల క్రితం బెంగళూర్‌లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు.

నరాల సంబంధిత వ్యాధితో కరీం బాధపడుతున్నాడని నన్నయ్య చెప్పారు. అయితే తెల్గీని కొన్ని రోజుల ముందే అస్పత్రికి తీసుకుని వచ్చి వుంటే పరిస్థితి ఇంతలా దిగజారేది కాదని ఆయన చెబుతున్నాడు. కాగా, గత 20 ఏళ్లుగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులతో సతమతమవుతున్న ఆయన.. ఎయిడ్స్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెదడు నుంచి వెన్నెముకకు దారితీసే కండరాలు, రక్తనాళాలు బలహీనపడ్డాయని, దీంతో ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు.

కాగా, వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను కూడా న్యాయస్థానం విధించింది. అయితే వీకే శశికళకు అందించినట్లే అబ్దుల్ కరీం తెల్గీకి కూడా జైలు అధికారులు దొడ్డిమార్గంలో రాజబోగాలను అందించినట్లు జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abdul kareem telgi  accused  kingpin  fake stamp papers  convicted  admited  health  hospital  banglore  karnataka  

Other Articles