national anthem row: SC says no need to stand up in movie halls సినిమా హాళ్లలో ఇక నిలబడాల్సిన పనిలేదు

Supreme court on national anthem says no need to stand up in movie halls

AM Khanwilkar, Chouksey, Dipak Misra, DY Chandrachud, KK Venugopal, Kodungallur Film Society, New Delhi, SC, Shyam Narayan Chouksey, Supreme Court, National anthem, movie Halls, people patriotism, amendment flag code, Chief Justice of india, Dipak Misra

Supreme Court asked the Centre to consider amending the rules to regulate the playing of the National Anthem before a film and said people to need not stand to prove patriotism

సినిమా హాళ్లలో ఇక నిలబడాల్సిన పనిలేదు

Posted: 10/24/2017 09:36 AM IST
Supreme court on national anthem says no need to stand up in movie halls

సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన సమయంలో ప్రేక్షకులందరూ తప్పనిసరిగా లేచి నిల్చోవాలంటూ గతంలో ఉత్తర్వులను జారీ చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇకపై ఆ అవసరం లేదని సవరణ చేసింది. సినిమాహాళ్లలో ప్రేక్షకులు జాతీయగీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోని తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వినోదం కోసం సినిమాహాళ్లకు వచ్చే ప్రేక్షకుడి దేశభక్తిని పరీక్షించే కొలమానం కాకూడదని దేశఅత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.

జాతీయ గీతాలాపన అంశమై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం విచారిస్తూ.. ఈ మేరకు కేంద్రాన్ని ఫ్లాగ్ కోడ్ నిబంధనలను సవరించాలని సూచించింది. ‘నిరంతరాయ వినోదం కోసం సినిమాలకు వెళ్లిన ప్రేక్షకులపై దేశభక్తిని జొప్పించేందుకు జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయడం. ప్రేక్షకులందరూ తప్పనిసరిగా నిల్చునేట్లు చేయడం కూడా అసమంజసమని అభిప్రాయపడిన న్యాయస్థానం.. ఈ విషయంలో తమ భుజాలపై తుపాలకు పెట్టి కేంద్రం కాల్చేందుకు ప్రయత్నిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దీంతో గత ఏడాది డిసెంబర్ 1న తామిచ్చిన ఉత్తర్వుల్లో పదాన్ని ‘తప్పనిసరి’ బదులు ‘చేయొచ్చు’ అని మార్చేందుకు సిద్ధమని తెలిపింది. జాతీయ గీతాలాపన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ విచక్షణకు వదిలేయాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలను తోసిపుచ్చుతూ.. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. అప్పటిలోగా జాతీయగీతం ఎక్కడ అలపించాలి, ఎక్కడ పాడకూడదో స్పష్టంగా చెబుతూ  ప్లాగ్ కోడ్ ను సవరణపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles