Vutukuru si transferred on rape attempt charges కీచక ఎస్సై: దేపుడి పేరు.. రాక్షస చేష్టలు..

Vutukuru si transferred on rape attempt charges

saidulu, vutukuru Sarpanch Padmaja, yedu kondalu, sub inspector, putukuru, saidapuram si, kurnool, andhra pradesh, crime

SI of Vutukuru in Kurnool district was transferred on attempt rape charges on vutukuru Sarpanch Padmaja

కీచక ఎస్సై: దేపుడి పేరు.. రాక్షస చేష్టలు..

Posted: 10/21/2017 11:22 AM IST
Vutukuru si transferred on rape attempt charges

రంపచోడవరం ఏసీపి స్థాయి అధికారి రవిబాబు మాజీ ఎమ్మెల్యే కూతురు పద్మలతతో అక్రమంగా వివాహేతర సంబంధం పెట్టుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అవసరం తీరిన తరువాత రౌడీషీటర్ తో ఒప్పందం చేసుకుని అమె అడ్డును తొలగించుకున్న  ఘటన తాలుకూ వివరాలను ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదు, ఈ క్రమంలో మరో పోలీసు అధికారి కూడా కీచకుడి అవతారం ఎత్తాడు. ఏకంగా అమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

స్వయంగా సర్పంచ్ అయిన వివాహితను లొంగదీసుకునేందుకు అనేక రకాలుగా యత్నించి.. చివరాఖున అమెపై పండుగ రోజునే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఏడు కొండల స్వామి పేరు పెట్టుకుని పవిత్ర పర్వదినాన ఓ ప్రజాప్రతినిధి శీలాన్నే కాటేయాలని యత్నించాడు. నీచపు పనికి ఒడికట్టి రాక్షస చర్యలకు పాల్పడిన సదరు ఎస్ఐపై తోసి ఇంట్లోంచి బయటకు పరుగులు పెట్టి.. స్థానిక మహిళలతో కలసి అతనిపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసింది బాధితురాలు.

విషయంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఊటుకూరు గ్రామ సర్పంచ్ గా పద్మజ అనే మహిళ ఉన్నారు. ఈమె వివాహిత. అయితే పలు కేసుల పరిష్కారం నిమిత్తం ఈమె ఇదే జిల్లాలోని సైదాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆయా కేసుల విషయంపై ఎస్సై ఏడుకొండలుతో మాట్లాడేది. అయితే పద్మజపై కన్నేసిన ఆ ఎస్సై.. ఆమెను ఏదో ఒక రకంగా లొంగదీసుకోవాలని భావించాడు.  నాలుగు నెలలుగా ఆమెను సెల్ ఫోన్ ద్వారా అసభ్యకర పదజాలంతో మెసేజ్ లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ క్రమంలో దీపావళి సందర్భంగా వూటుకూరు వచ్చిన ఏడుకొండలు - పద్మజ నివాసానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.  దీంతో తీవ్ర భయబ్రాంతులకు గురైన పద్మజ అతని బారి నుంచి తప్పించుకుని ఇరుగుపొరుగు మహిళల సాయంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన మహిళా సంఘాలు ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే - సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని - తక్షణం ఎస్సై ఏడుకొండలును విధుల నుంచి తప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saidulu  sub inspector  putukuru  saidapuram si  kurnool  andhra pradesh  crime  

Other Articles