Five of family found dead in RCPuram ఆర్థిక సమస్యలతో కుటుంబం బలవన్మరణం..

Five of family found dead in rcpuram police suspects suicide

Patlolla prabhakar reddy, p prabhakar reddy family suicide, family commits suicide, financial problems, Kollur, RC puram, shanker pally, indranagar kanche, Sangareddy, Telangana

Five members of a family, allegedly committed suicide at Indranagar of kollur village which falls under ramachandrapuram mandal of sangareddy district. The family was reportedly resident of ameenpur mandal and facing a serious financial problem.

ఓఆర్ఆర్ లో దారుణం.. నిర్మానుష్య ప్రాంతంలో ఐదు మృతదేహాలు..

Posted: 10/17/2017 10:30 AM IST
Five of family found dead in rcpuram police suspects suicide

నగర శివార్లలో దారుణం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకున్ని వున్న నిర్మానుష్ ప్రాంతంలో ఏకంగా ఐదుగురి మృతదేహాలు లభ్యం కావడం పెను కలకలం రేపుతుంది. తొలుత ముగ్గురు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయని సమాచారంతో సంచలనం కాగా.. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టగా,, మహిళల మృతదేహాలకు సమీపంలోనే మరో ఇద్దరు పురుషుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో స్థానికంగా పెను సంచలనం రేగింది. ఘటనాస్థలానికి సమీపంలోని ప్రజలు వచ్చి చూసి.. కుటుంబం మొత్తం అత్మహత్య చేసుకుందని విషాదంలో మునిగిపోయారు.

రామచంద్రాపురం మండలం కొల్లూరు.. శంకర్ పల్లి మండలం ఇంద్రానగర్ కంచె సరిహద్దు ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. వారిని అమీన్ పూర్ గ్రామ నివాసస్థులుగా గుర్తించారు. పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు కూతళ్లు, కుమారుడితో పాటు శ్రీశైలం వెళ్లివస్తామని బంధువులకు చెప్పి వెళ్లారు. అయితే వెళ్లినవారు ఇంకా ఇంటికి తిరిగిరాకపోవడంతో రెండు రోజుల క్రితం వారి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్పింగ్ కేసు నమోదు చేశారు.

ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి మృతదేహాలు నిర్మానుష్య ప్రాంతంలోని చెట్ల పోదల్లో పడివుండగా, పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి తో పాటు అతని కుమారుడు వర్జిత్ రెడ్డి మృతదేహాలు స్విస్ట్ డిజైర్ కారులో వున్నాయి. అయితే వీరు అర్థిక ఇబ్బందులకు గురై కుటుంబం మొత్తం బలన్మరణాలకు పాల్పడ్డారా..? లేక అస్తుల లావాదేవీల విషయంలో ఎవరైనా వీరిని వెంబడించి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం.. అధారాలను సేకరించే పనిలో వుంది.

కాగా కుటుంబసభ్యులందరూ ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా పలు అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు వారు తమ కారులో కొల్లూరు వద్దకు చేరుకుని అక్కడ కవర్లో తమ వెంట తీసుకోచ్చిన అహార పధార్థాలను తీసుకున్నట్లు కూడా అక్కడ కొన్ని అధారాలు లభ్యమవుతున్నాయి. అయితే అవి వీరు తెచ్చుకున్నవేనా..? లేక అంతకుముందే ఎవరైనా తెచ్చుకన్నారా..? అన్న వివరాలు తెలియాలి. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మృతుల కాల్ డేటా అధారాంగా కూడా దర్యాప్తును ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles